ఏ విధమైనటువంటి అంచనాలు లేకుండా కన్నడ చిత్ర పరిశ్రమ నుంచి ఇండస్ట్రీలోకి నేషనల్ క్రష్ గా పేరు సంపాదించుకున్న రష్మిక గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ఛలో సినిమా ద్వారా తెలుగు తెరకు పరిచయమైన ఈ ముద్దుగుమ్మ గీతగోవిందం సినిమాతో బ్లాక్ బస్టర్ హిట్ అందుకున్నారు.ఇలా వరుస సినిమాలతో ఎంతో బిజీగా గడుపుతున్న ఈమె ప్రస్తుతం పాన్ ఇండియా స్టార్ హీరోయిన్ గా మారిపోయారు. ప్రస్తుతం వరుస పాన్ ఇండియా సినిమాలతో ఎంతో బిజీగా ఉన్నా రష్మిక ఎంతో ఫిట్ గా ఉంటారు. అయితే ఈమె ఇలా ఫిట్ గా ఉండటానికి గల సీక్రెట్ ఏంటి? ఈమె ఎలాంటి డైట్ ఫాలో అవుతారు అనే విషయాల గురించి ఇక్కడ తెలుసుకుందాం…
రష్మిక తన ఫిట్ నెస్ కాపాడుకోవడం కోసం ఎన్నో వర్కౌట్స్ చేస్తూ సరైన డైట్ ఫాలో అవుతూ ఉంటారు. పలు నివేదికల ప్రకారం రష్మిక ప్రతిరోజు ఉదయం నీటిలో ఆపిల్ సైడర్ వెనిగర్ తాగుతారు. పూర్తిగా ఈమె ఇంటిలో తయారు చేసిన ఆహారం తినడానికి ఇష్టపడతారట. అన్నం, ఫ్రైడ్ రైస్, జంక్ ఫుడ్ వంటి వాటికి ఈమె దూరంగా ఉంటారు. వీలైనంతవరకూ ఫ్రూట్ సలాడ్, సీజనల్ ఫ్రూట్స్, సూప్స్,చిలగడ దుంపలు, కొబ్బరి నీళ్లు ఎక్కువగా తీసుకుంటారు.
ఈ ఫుడ్ డైట్ తో పాటు ఎక్కువగా ఈమె శరీరం వ్యాయామాలను చేస్తూ తన ఫిట్నెస్ కాపాడుకుంటున్నారు. వారానికి నాలుగు నుంచి ఐదు రోజులు ఈమె జిమ్ లో భారీ వర్కౌట్స్ చేస్తూ ఉంటారు. ఈ విధంగా జిమ్ కి వెళ్ళని రోజు ఇంట్లోనే పవర్ యోగ, స్విమ్మింగ్, వాకింగ్, బాక్సింగ్ వంటి వాటిని చేస్తూ తన ఫిట్నెస్ కాపాడుకుంటూ వస్తున్నారు.ఇక రష్మిక ప్రస్తుత సినిమాల విషయానికి వస్తే పలు బాలీవుడ్ చిత్రాలతో బిజీగా ఉన్నారు. అలాగే తెలుగులో పుష్ప2 సినిమాలో కూడా ఈమె నటించనుంది.