Nagarjuna: టాలీవుడ్ ఇండస్ట్రీలో అక్కినేని ఫ్యామిలీ గురించి తెలియని వారుండరు. అక్కినేని నాగేశ్వర రావు నుంచి నేటి అఖిల్ వరకూ వారి సినిమాల పరంపర సాగుతూ వస్తోంది. నాగేశ్వరరావు తర్వాత అంతటి భారీ హిట్‌లు అందుకున్నది అంటే కచ్చితంగా నాగార్జునే. తెలుగు సినీ పరిశ్రమలో మన్మథుడిగా పేరు తెచ్చుకున్న నాగార్జున గురించి ఎంత చెప్పినా తక్కువే. రొమాంటిక్ హీరోగానే కాక, అన్నమయ్య, శ్రీరామదాసు లాంటి భక్తిరస చిత్రాలల్లోనూ నటించి అభిమానుల హృదయాలను దోచుకున్నారు.
ఇక నాగార్జున నటించిన సూపర్ హిట్ సినిమాల గురించి చెప్పాలంటే చాలానే ఉన్నాయి. అందులో ముఖ్యంగా మాస్, మన్మథుడు, సంతోషం లాంటి సినిమాలు ఇప్పటికీ ఎవర్ గ్రీన్ మూవీస్ లిస్ట్‌లో ఉంటాయి. అప్పట్లో అటు ఫ్యామిలీని, యూత్‌ను బాగా ఎంటర్‌టైన్ చేసిన సినిమాల్లో నాగార్జున సినిమాలు ప్రత్యేకమైనవనే చెప్పాలి. ఆ తర్వాత వచ్చిన శివమణి కూడా తక్కువేం కాదు. ఇలా చెప్పుకుంటూ పోతే కింగ్ నాగార్జున సినిమాలు చాలానే ఉంటాయి.