Kajal Son Name: కాజల్ అగర్వాల్ కొడుకు పేరేంటో తెలుసా… ఎంత క్యూట్ గా ఉందో!

Kajal Son Name: వెండితెర చందమామగా ఎంతో మంచి పేరు సంపాదించుకున్న కాజల్ అగర్వాల్ 2020 సంవత్సరంలో తన చిన్ననాటి స్నేహితుడు గౌతమ్ కుచ్లు ను వివాహం చేసుకున్న సంగతి మనకు తెలిసిందే. వివాహం తర్వాత కూడా కాజల్ కొరటాల శివ దర్శకత్వంలో తెరకెక్కిన ఆచార్య సినిమాలో నటించారు. ఈ సినిమా ఈనెల 29వ తేదీన ప్రేక్షకుల ముందుకు రానుంది.ఇకపోతే కాజల్ అగర్వాల్ వివాహం తర్వాత వైవాహిక జీవితాన్ని ఎంతో ఎంజాయ్ చేస్తున్నారు ఈ క్రమంలోనే కాజల్ గర్భవతి కావడంతో తను కమిట్ అయిన సినిమాల నుంచి తప్పుకున్నారు.

ఇక కాజల్ అగర్వాల్ గర్భవతి అంటూ తన భర్త గౌతమ్ నూతన సంవత్సరం కానుకగా తన అభిమానులకు సర్ప్రైజ్ ఇచ్చారు. అప్పటి నుంచి కాజల్ అగర్వాల్ తన బేబీ బంప్ ఫోటోలను సోషల్ మీడియా వేదికగా షేర్ చేస్తూ అభిమానులను సందడి చేస్తున్నారు. ఇకపోతే కాజల్ అగర్వాల్ ఏప్రిల్ 19వ తేదీ ఉదయం ఒక పండంటి మగబిడ్డకు జన్మనిచ్చారు. ఈ విషయాన్ని తన భర్త సోషల్ మీడియా వేదికగా వెల్లడించారు. ఇక ఈ విషయం సోషల్ మీడియాలో తెలియడంతో పెద్ద ఎత్తున అభిమానులు కాజల్ అగర్వాల్ కు శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు.

కాజల్ అగర్వాల్ పండంటి మగ బిడ్డకు జన్మనివ్వడంతో తన భర్త గౌతమ్ తన బిడ్డ పేరును నీల్ అని ప్రకటిస్తూ మరొక పోస్ట్ చేశారు.ప్రస్తుతం కాజల్ అగర్వాల్ కొడుకు పేరు సోషల్ మీడియాలో వైరల్ గా మారడంతో ఎంతో మంది కాజల్ కొడుకు పేరు ఎంతో ముద్దుగా ఉంది అంటూ కామెంట్లు చేస్తున్నారు. ఇక నీల్ అనే ఈ పదానికి అర్థం ఏమిటి అంటూ పెద్ద ఎత్తున నెటిజన్లు సెర్చ్ చేయగా కాజల్ తన కొడుకు పెట్టిన నీల్ అనే పేరుకు ఛాంపియన్ అనే అర్థం రావడంతో కాజల్ దంపతులు తన కుమారుడికి ఎంతో అందమైన పేరును పెట్టారంటూ కామెంట్లు చేస్తున్నారు.