Jabardasth: దారుణంగా జబర్దస్త్ శాంతి స్వరూప్ పారితోషికం… ఎంతో తెలుసా?

Jabardasth: జబర్దస్త్ కార్యక్రమంలో గత సుదీర్ఘ కాలం నుంచి లేడీ గెటప్ ద్వారా ప్రేక్షకులను సందడి చేస్తున్న వారిలో శాంతిస్వరూప్ ఒకరు. శాంతి స్వరూప్ ఎక్కువగా హైపర్ ఆది స్కిట్ ల ద్వారా ఎంతో ఫేమస్ అయ్యారు. లేడీ గెటప్ లో తన అద్భుతమైన కామెడీ స్కిట్ లతో ప్రేక్షకులను సందడి చేస్తున్న శాంతి స్వరూప్ ప్రస్తుతం యూట్యూబ్ ఛానల్ నిర్వహిస్తూ ఉన్నారు. అలాగే ప్రవేట్ ఈవెంట్ కి అటెండ్ అవుతూ అందరిని సందడి చేస్తున్నారు.

ఇకపోతే తాజాగా ఈయన ఖరీదైన కారును కూడా కొనుగోలు చేసిన విషయం మనకు తెలిసిందే.ఇలా ఖరీదైన కార్లు కొనుగోలు చేయడంతో ఈయనకు జబర్దస్త్ లో భారీ మొత్తంలో రెమ్యూనరేషన్ ఇస్తూ ఉంటారని చాలామంది భావిస్తారు. నిజానికి ఈయనకు జబర్దస్త్ కార్యక్రమంలో ఇచ్చే రెమ్యూనరేషన్ ఎంతో తెలిస్తే ప్రతి ఒక్కరూ షాకవ్వాల్సిందే. జబర్దస్త్ కార్యక్రమంలో లేడీ గెటప్ లో నటిస్తున్నటువంటి శాంతి స్వరూప్ ఒక్క షెడ్యూల్ కి కేవలం 10 నుంచి 15 వేల రూపాయలు మాత్రమే పారితోషికం తీసుకుంటున్నారని సమాచారం.

ఇలా ఎన్నో సంవత్సరాల నుంచి ఈ కార్యక్రమంలో పని చేస్తున్నప్పటికీ ఈయనకు మాత్రం చాలా తక్కువ పారితోషికం ఇస్తున్నారని చెప్పాలి. అయితే బయట ప్రైవేట్ ఈవెంట్స్ చేస్తూ అలాగే యూట్యూబ్ ఛానల్ నడుపుతున్న శాంతి స్వరూప్ బాగానే సంపాదిస్తున్నాడు. ఇక జబర్దస్త్ కార్యక్రమమే తనకు అన్నం పెట్టిందని ఎన్నోసార్లు తెలియజేసిన శాంతి స్వరూప్ అన్నం పెట్టిన ఆ కార్యక్రమాన్ని వదలకుండా పారితోషికం తక్కువే అయినా అక్కడే కొనసాగుతూ అభిమానులను ప్రేక్షకులను సందడి చేస్తున్నారు.