టాలీవుడ్ ఇండస్ట్రీలో యంగ్ హీరోగా ఎంత పేరు ప్రఖ్యాతలు సంపాదించుకున్న నాగశౌర్య హిట్ ఫ్లాపాలతో సంబంధం లేకుండా వరుస సినిమాలలో నటిస్తూ బిజీగా ఉన్నారు. ఇలా ఇండస్ట్రీలో కొన్ని సంవత్సరాల నుంచి హీరోగా కొనసాగుతున్న నాగశౌర్య ఎప్పుడు కూడా ఎలాంటి వివాదాలను ఎదుర్కోలేదు. అలాగే ఈయనకు సంబంధించి ఎలాంటి రూమర్లు కూడా వినిపించలేదు. ఎంతో సైలెంట్ గా ఉండే నాగశౌర్య ఏకంగా అనూష శెట్టి అనే అమ్మాయి ప్రేమలో దింపి ప్రేమ వివాహం చేసుకున్నారు. అయితే నాగశౌర్య అనూష శెట్టి మధ్య ప్రేమ ఎప్పుడూ చిగురించిందనే విషయానికి వస్తే…
అనూష శెట్టి ప్రముఖ ఇంటీరియర్ డిజైనర్ కావడం విశేషం. ఈమె ఇంటీరియర్ డిజైనర్ గా ఎంతో పేరు ప్రఖ్యాతలు సంపాదించుకున్నారు.ఇలా ఇంటిరియర్ డిజైనర్ గా బెస్ట్ అవార్డు కూడా అందుకున్నటువంటి అనూష శెట్టి డిజైనింగ్ నచ్చడంతో నాగశౌర్య ఆమెకు పెద్దపెద్ద కాంట్రాక్ట్స్ కూడా ఇప్పించారట. ఇలా వృత్తిపరమైన జీవితం ద్వారా అనూష శెట్టితో నాగశౌర్యపరిచయం ఏర్పడింది. ఇలా వీరిద్దరి మధ్య ఏర్పడిన పరిచయం స్నేహంగా మారడం అనంతరం ఆ స్నేహం ప్రేమగా మారడం జరిగింది.
ఇలా ప్రేమలో ఉన్నటువంటి ఈ జంట వారి ప్రేమ విషయాన్ని పెద్దలకు తెలియజేసే చివరికి పెద్దల సమక్షంలో వివాహం చేసుకున్నారు. నవంబర్ 20వ తేదీ నాగశౌర్య అనూషల వివాహం బెంగళూరులో ఎంతో ఘనంగా జరిగింది.ఇలా వీరిది ప్రేమ వివాహం అని తెలియడంతో ఎంతోమంది నాగశౌర్య ఎప్పుడు ఎంతో అమాయకంగా కనిపిస్తూ ఉన్నప్పటికీ ఇలా ప్రేమించి పెళ్లి చేసుకోవడంతో పలువురు ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు ఇక వీరి వివాహ ఫోటోలు ప్రస్తుతం వైరల్ కావడంతో ఈ దంపతులకు శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు.