సురేఖ వాణి ఒక్కో సినిమాకు తీసుకునే రెమ్యూనరేషన్ ఎంతో తెలుసా… మరి అంత తక్కువనా?

టాలీవుడ్ ఇండస్ట్రీలో ఎంతో మంది క్యారెక్టర్ ఆర్టిస్టులు నటిస్తూ విపరీతమైన గుర్తింపు సంపాదించుకున్నారు. ఇలా క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా ఎంతో మంచి పేరు ప్రఖ్యాతలు సంపాదించుకున్న వారిలో సురేఖ వాణి ఒకరు. ఈమె ఎంతోమంది అగ్ర హీరోల సినిమాలలో నటిస్తూ ఇండస్ట్రీలో ఎంతో పేరు ప్రఖ్యాతలు సంపాదించుకున్నారు.ఇలా ఓవైపు సినిమా ఇండస్ట్రీలో బిజీగా ఉండటమే కాకుండా సోషల్ మీడియాలో కూడా ఎంతో యాక్టివ్ గా ఉంటూ పెద్ద ఎత్తున అభిమానులను సొంతం చేసుకున్నారు.

ఇకపోతే సోషల్ మీడియా వేదికగా నిత్యం సురేఖ వాణి తన కూతురితో కలిసి చేసే సందడికి సంబంధించిన ఫోటోలు వీడియోలను అభిమానులతో పంచుకుంటారు. ఇలా సోషల్ మీడియా వేదికగా సురేఖవాణి తన కూతురు సుప్రీత చేసే హంగామా మామూలుగా ఉండదు. ఇకపోతే సురేఖ వాణి ఇప్పటికే ఎన్నో సినిమాలలో స్టార్ కమెడియన్స్ సరసన నటించారు.అయితే ఈమె ఒక్కో సినిమాకు ఎంత మొత్తంలో రెమ్యూనరేషన్ తీసుకుంటారనే విషయం గురించి చర్చనీయాంశంగా మారింది.

సురేఖ వాణి సినిమాలలో తన పాత్ర డిమాండ్ బట్టి అలాగే తన పాత్ర ఉన్న నిడివి బట్టి రెమ్యూనరేషన్ డిమాండ్ చేస్తారని తెలుస్తోంది. అయితే ఈమె ఒక్కో సినిమాకు సుమారు 8 నుంచి 10 లక్షల రూపాయల వరకు రెమ్యూనరేషన్ తీసుకుంటారని సమాచారం. నటిగా కొన్ని సంవత్సరాల నుంచి ఇండస్ట్రీలో కొనసాగుతున్న సురేఖవాణి ఒక్కో సినిమాకు పది లక్షల రెమ్యూనరేషన్ అంటే తక్కువే అని చెప్పాలి. అయితే ఈమె సినిమాలలో నటిస్తూ సుమారు 10 కోట్ల రూపాయల ఆస్తులను కూడబెట్టినట్లు తెలుస్తోంది. ఇక సురేఖ వాణి తన భర్త మరణం తర్వాత తన కూతురితో కలిసి ఒంటరిగా జీవనం కొనసాగిస్తుంది.