Big Boss Host: బిగ్ బాస్ హోస్ట్ గా శింబు ఎంత పారితోషికం తీసుకున్నారో తెలుసా?

Big Boss Host: బుల్లితెరపై ప్రసారమౌతూ ఎంతో మంచి గుర్తింపు తెచ్చుకున్న బిగ్ బాస్ కార్యక్రమం గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ఇప్పటివరకు ఈ కార్యక్రమం బుల్లితెరపై ప్రసారం అవుతూ ఎంతో మంచి ఆదరణ దక్కించుకుంది. ఈ క్రమంలోని ఇప్పటివరకు హిందీలో ఈ కార్యక్రమం ఓటీటీలో ప్రసారం అవుతూ బాగా గుర్తింపు సంపాదించుకోవడంతో అదే బాటలోనే తెలుగు తమిళ భాషల్లో కూడా ఈ కార్యక్రమాన్ని డిజిటల్ ప్లాట్ ఫామ్ లో ప్రసారం చేస్తున్నారు.

ఇక తెలుగులో ఈ కార్యక్రమానికి నాగార్జున హోస్ట్ గా వ్యవహరిస్తున్నారు.అలాగే తమిళంలో బిగ్ బాస్ కార్యక్రమానికి బ్రాండ్ అంబాసిడర్ గా ఉన్నటువంటి కమల్ హాసన్ కొన్ని అనివార్య కారణాల వల్ల ఈ కార్యక్రమం నుంచి తప్పుకున్నారు. ఈ క్రమంలోనే కమల్ హాసన్ స్థానంలో కి యంగ్ హీరో శింబు ఎంట్రీ ఇచ్చారు. ఇలా బిగ్ బాస్ కార్యక్రమానికి మొదటిసారి హోస్ట్ గా వ్యవహరిస్తున్నటువంటి శింబు భారీ మొత్తంలోనే పారితోషికం తీసుకుంటున్నట్లు తెలుస్తోంది.

ఇలా ఈ యంగ్ హీరో బిగ్ బాస్ కార్యక్రమానికి హోస్ట్ గా వ్యవహరించడం కోసం కేవలం ఒక ఎపిసోడ్ కు మాత్రమే కోటి రూపాయల వరకు పారితోషికం తీసుకుంటున్నట్లు తెలుస్తోంది. ఇలా ఈ కార్యక్రమం పూర్తి అయ్యేసరికి ఈ యంగ్ హీరో సుమారు ఐదారు కోట్ల రూపాయల పారితోషికం అందుకోబోతున్న ట్లు తెలుస్తోంది.ఇక తెలుగులో కూడా ఈ కార్యక్రమానికి హోస్ట్ గా వ్యవహరిస్తున్న నాగార్జున కూడా భారీ మొత్తంలో రెమ్యూనరేషన్ తీసుకుంటున్నట్లు సమాచారం.