అనసూయ ఒకరోజు కాల్షీట్ కోసం ఎంత రెమ్యూనరేషన్ తీసుకుంటారో తెలుసా?

జబర్దస్త్ యాంకర్ అనసూయ ప్రస్తుతం వరుస సినిమాలతో దూసుకుపోతున్నారు. ఒకప్పుడు కేవలం బుల్లితెర యాంకర్ గా ఎంతో పేరు ప్రఖ్యాతలు సంపాదించుకున్న ఈమె రంగస్థలం సినిమాలోని రంగమ్మత్త పాత్ర ద్వారా విపరీతమైన క్రేజ్ ఏర్పరుచుకున్నారు.ఈ పాత్ర ద్వారా ఎంతో మంచి గుర్తింపు సంపాదించుకున్న అనసూయ ప్రస్తుతం వరుస సినిమాలలో నటిస్తూ ఎంతో బిజీ బిజీగా ఉన్నారు. ఈ క్రమంలోనే వరుస సినిమాల్లో నటిస్తున్న ఈమె ఒక్కో సినిమాకు ఎంత రెమ్యూనరేషన్ తీసుకుంటారు అనే విషయం తెలిస్తే ఆశ్చర్యపోవాల్సిందే.

అనసూయ జబర్దస్త్ కార్యక్రమం ద్వారా మంచి గుర్తింపు సంపాదించుకున్న అనంతరం వెండితెర ఎంట్రీ ఇచ్చారు. ఈమెకు హీరోయిన్ రేంజ్ పాపులారిటీ ఉన్నప్పటికీ క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా నటిస్తూ ఇండస్ట్రీలో కొనసాగుతున్నారు. ఇకపోతే అనుసూయ సినిమా కోసం ఒక రోజు షూటింగ్ లో పాల్గొంటే ఏకంగా 5 నుంచి 6.5 లక్షల రెమ్యునరేషన్ తీసుకుంటుందని సమాచారం.ఇలా ఈమె పది రోజులపాటు షూటింగ్ లో పాల్గొంటే 50 లక్షలు 20 రోజులపాటు షూటింగ్ లో పాల్గొంటే కోటి రూపాయల వరకు రెమ్యూనరేషన్ తీసుకుంటారు.

ఇకపోతే తాజాగా అనసూయ నటించిన పుష్ప సినిమా కోసం పెద్దగా ఈమె కాల్షీట్స్ ఇవ్వలేకపోయినా ఈ సినిమా కోసం అనసూయ ఏకంగా 40 లక్షల రూపాయల రెమ్యునరేషన్ తీసుకున్నారు. ఇక ఈమె పాత్ర నిడివి ఎక్కువగా ఉంటే ఇంతకన్నా పెద్ద మొత్తంలోనే రెమ్యూనరేషన్ తీసుకుంటారు. ఈ విధంగా ఒక వైపు బుల్లితెరపై మరోవైపు వెండితెరపై అలాగే కమర్షియల్ యాడ్స్ కూడా చేస్తూ అనసూయ ఎంతో బిజీగా ఉంటూ, భారీగా డబ్బు సంపాదిస్తున్నారు.