కొడుకు మెయింటెనెన్స్ కోసం నరేష్ ప్రతినెల ఎంత చెల్లిస్తున్నాడో తెలుసా?

ప్రస్తుతం టాలీవుడ్ ఇండస్ట్రీలో ఏదైనా హాట్ టాపిక్ ఉందా అంటే అది కేవలం నరేష్ పవిత్ర లోకేష్ వ్యవహారమే అని చెప్పాలి. నరేష్ ఇదివరకే మూడు పెళ్లిళ్లు చేసుకొని ముగ్గురికి ముగ్గురు భార్యలకు దూరంగా ఉంటూ నాలుగో సారి పెళ్లి చేసుకోవడానికి సిద్ధమయ్యారు.అయితే ఈయన ఇద్దరు భార్యలకు విడాకులు ఇవ్వగా మూడవ భార్య రమ్య రఘుపతికి మాత్రం ఇప్పటివరకు విడాకులు ఇవ్వలేదు వీరి విడాకుల వ్యవహారం కోర్టులో ఉండడంతోనే ఈయన నటి పవిత్ర లోకేష్ తో సహజీవనం చేస్తున్నారని, రమ్యతో తన విడాకుల వ్యవహారం పూర్తికాగానే వీరిద్దరూ పెళ్లి చేసుకోవాలని నిర్ణయించుకున్నట్లు తెలుస్తోంది.

ఈ క్రమంలోనే నరేష్ పవిత్ర లోకేష్ త్వరలో పెళ్లి చేసుకోబోతున్నామని ఒక వీడియో ద్వారా సందేశాన్ని తెలియజేశారు అయితే రమ్య రఘుపతి మాత్రం వీరిద్దరి పెళ్లి జరగనివ్వనని శపదాలు చేస్తున్నారు. తాను ఇంట్లో వాళ్ళను ఎదిరించి నరేష్ ని పెళ్లి చేసుకున్నానని అయితే నరేష్ తనకు విడాకులు ఇస్తానంటే అందుకు తాను ఒప్పుకోనని రమ్య వెల్లడించారు.ఇక తన కుమారుడు కూడా నరేష్ కి విడాకులు ఇవ్వకూడదని మేమిద్దరం కలిసి ఉండాలని నా నుంచి ఒట్టు తీసుకున్నారని తెలిపారు.

ఇక నరేష్ నుంచి తాను దూరంగా ఉండటం వల్ల బాబు మెయింటెనెన్స్ కోసం గతంలో తన 50 వేల రూపాయలు నెలకు చొప్పున ఇచ్చేవారు అయితే గత మూడు సంవత్సరాల నుంచి 70 వేల రూపాయలు అందిస్తున్నారని రమ్య రఘుపతి వెల్లడించారు.ఇక నరేష్ విడాకులు తీసుకోవడం కోసం ఆయన మూడు కోట్ల నుంచి 20 కోట్ల వరకు నాకు ఆఫర్ చేశారు ఆయనప్పటికీ తాను విడాకులు ఇవ్వనని నాకు విడాకులు కన్నా డబ్బు కన్నా తన భర్తతో కలిసి ఉండటమే ముఖ్యం అంటూ ఈ సందర్భంగా రమ్య రఘుపతి చేసిన ఈ కామెంట్స్ వైరల్ అవుతున్నాయి.