ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ ఈ పేరు గురించి ప్రత్యేకంగా పరిచయం అవసరం లేదు. సినీ బ్యాక్ గ్రౌండ్ ఉన్న కుటుంబం నుంచి ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చినప్పటికీ ఏ విధంగానూ తన కుటుంబం సపోర్ట్ తీసుకోకుండా సొంత టాలెంట్ తో తెలుగు ఇండస్ట్రీలో అగ్ర నటుడిగా కొనసాగడమే కాకుండా పాన్ ఇండియా హీరోగా గుర్తింపు పొందారు. ఈ విధంగా పుష్ప సినిమా ద్వారా హీరో అయిన అల్లు అర్జున్ ప్రస్తుతం తన తదుపరి చిత్రం పుష్ప 2 సినిమాతో బిజీకానున్నారు.
ఈ విధంగా తన స్టైల్, మేనరిజంతో విపరీతమైన ఫ్యాన్ ఫాలోయింగ్ ఏర్పరచుకున్న ఈయనకు ఇండస్ట్రీలో భారీ మార్కెట్ ఉందని చెప్పాలి. ఒక్కో సినిమాకు 30 నుంచి 40 కోట్ల రెమ్యూనరేషన్ తీసుకుంటున్న అల్లుఅర్జున్ పుష్ప 2 కోసం ఏకంగా వంద కోట్ల రూపాయల రెమ్యూనరేషన్ డిమాండ్ చేశారని తెలుస్తోంది. ఈ విధంగా కోట్లలో రెమ్యూనరేషన్ తీసుకుని అల్లు అర్జున్ నెలకు ఎంత సంపాదిస్తారనే విషయం తెలిస్తే ప్రతి ఒక్కరూ షాకవ్వాల్సిందే.
వరుస సినిమాలతో ఎంతో బిజీగా ఉండే అల్లుఅర్జున్ కు సోషల్ మీడియాలో కూడా విపరీతమైన ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంది.ఈయన సోషల్ మీడియా వేదికగా ఒక్క పోస్ట్ చేస్తే చాలు క్షణాల్లో మిలియన్ల సంఖ్యలో వ్యూస్ సంపాదించుకుంటుంది. ఈ విధంగా అల్లుఅర్జున్ నెలకు భారీగానే సంపాదిస్తున్నారని సమాచారం. పలు సర్వేల ప్రకారం అల్లుఅర్జున్ నెలకు 3 కోట్ల రూపాయలకు పైగానే సంపాదిస్తున్నారని తెలుస్తోంది. నెలకు 3 కోట్లు అంటేనే అల్లు అర్జున్ రేంజ్ ఏంటో అర్థమవుతుంది.