Roja: అలనాటి హీరోయిన్ రోజా తన అందం, అభినయంతో టాలీవుడ్ లో ఒకప్పుడు స్టార్ హీరోయిన్ గా మంచి గుర్తింపు తెచ్చుకుంది.అయితే రోజా రాజకీయాల్లోకి ప్రవేశించిన తర్వాత సినిమాలకు పూర్తిగా దూరం అయింది. అయిన కూడా ఈటీవీలో ప్రసారమవుతున్న జబర్దస్త్ కామెడీ షో ద్వారా ప్రేక్షకులను అలరిస్తూనే ఉంది. రోజా ఒకవైపు రాజకీయాలు మరొకవైపు టీవీ షోస్, భర్త పిల్లలు ఇలా నిత్యం బిజీగా ఉంటూ ఎంతోమంది స్త్రీలకు నిదర్శనంగా నిలిచింది. అయితే ఇటీవల రాజకీయాలలో రోజా గారికి మంత్రి పదవి దక్కడంతో జబర్దస్త్ కామెడీ షో కి కూడా స్వస్తి చెప్పింది.
జబర్దస్త్ ప్రారంభమైన నాటి నుండి ఇప్పటి వరకు దాదాపు పది సంవత్సరాలు రోజా జబర్దస్త్ కార్యక్రమానికి జడ్జిగా వ్యవహరించింది. జబర్దస్త్ లో రోజా కనిపించకపోవతంతో ఆమె స్థానాన్ని నటి ఇంద్రజ గారు భర్తీ చేశారు .అయితే గత పది సంవత్సరాలుగా జబర్దస్త్ లో జడ్జిగా వ్యవహరిస్తున్న రోజా జబర్దస్త్ నుండి ఎన్ని కోట్ల రూపాయలు సంపాదించింది అనే ప్రశ్న ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. అయితే షో మొదలైన నా రెండు సంవత్సరాల క్రితం వరకు రోజా తక్కువ మొత్తంలో రెమ్యునరేషన్ తీసుకునేది. కానీ రెండు సంవత్సరాలుగా ఒక్కో ఎపిసోడ్ కి రోజా లక్షల్లో రెమ్యునరేషన్ తీసుకునేది. ఇలా మల్లెమాల వారినుండి దాదాపు మూడు కోట్ల వరకు రోజా రెమ్యూనరేషన్ తీసుకుంది.
రెండు సార్లు ఎమ్మెల్యేగా గెలుపొందిన రోజా ప్రస్తుతం క్యాబినెట్ లో మంత్రి పదవి దక్కించుకుంది. అందువల్ల తన మొత్తం సమయాన్ని ప్రజాసంక్షేమానికి కేటాయించాలన్న ఉద్దేశంతో జబర్దస్త్ నుండి తప్పుకుంటున్నట్లు రోజా వెల్లడించింది. జడ్జ్ గా ప్రేక్షకుల ఆదరణ పొందిన రోజా, మంత్రిగా కూడా ప్రజల అభిమానాన్ని సొంతం చేసుకోవాలని ఆమె అభిమానులు కోరుకుంటున్నారు.