Allu Ayaan Birthday: టాలీవుడ్‌లో మోస్ట్ స్టైలిష్ &ఐకాన్ హీరోగా ఎదిగిన నటుడు అల్లు అర్జున్. తన యాక్టింగ్‌తో, డ్యాన్స్‌లతో ప్రేక్షకులను అలరిస్తూ భారీ క్రేజ్‌ను సొంతం చేసుకున్నాడు. ఈ మధ్యకాలంలో వచ్చిన పుష్ప సినిమాతో వివిధ భాషల్లో బన్నీ అదరగొట్టాడు. తనదైన స్టైల్, మేనరిజమ్స్‌తో సందడి చేసే ఈ హీరోకు రోజురోజుకీ పాపులారిటీ పెరుగుతూ వస్తోంది. ఇక అర్జున్ సతీమణి స్నేహారెడ్డిల ముద్దుల పిల్లలు అల్లు అర్హ, అల్లు అయాన్‌కు కూడా సోషల్ మీడియాలో బోలెడు క్రేజ్ ఉంది. ముఖ్యంగా ‘శాకుంతలం’ సినిమాతో వెండితెరపైకి అడుగుపెడుతున్న అల్లు అర్హకు సంబంధించిన ఫొటోలు, వీడియోలు నెటిజన్లను తెగ ఆకట్టుకుంటున్నాయి.
కాగా తాజాగా అల్లు అయాన్ బర్త్‌డే సందర్భంగా అల్లు అర్జున్ షేర్ చేసిన ఓ పిక్ ప్రస్తుతం సామాజిక మాధ్యమాల్లో వైరల్ అవుతోంది. ఇక వివరాల్లోకి వెళితే, అల్లు అర్జున్‌కు తన పిల్లలంటే ఎంతిష్టమో అందరికీ తెలిసిందే. కాస్త సమయం దొరికినా ఫ్యామిలీతో, పిల్లలతో గడుపుతూ లైఫ్‌ను ఎంజాయ్ చేస్తుంటాడు. అయితే ఎప్పుడూ తన కూతురు అర్హకు సంబంధించిన ఫొటోలు, వీడియోలు మాత్రమే పోస్ట్ చేసే అల్లు అర్జున్ తొలిసారిగా తన గారాల కుమారుడు అల్లు అయాన్, తాను కలిసి ఉన్న ఫొటోను పంచుకున్నారు.
ఎప్పుడూ కూతురంటేనే అత్యంత ప్రేమ అన్నట్టుగా కనిపించే బన్నీ, ఈ సారి కొడుకుపైనా అంతకు మించిన ప్రేమ ఉందని ఈ పిక్‌తో చెప్పకనే చెప్పాడు. తన కొడుకు అయాన్ పుట్టిన రోజు సందర్భంగా ఆయన చేసిన ఓ పోస్ట్ ఇప్పుడు వైరల్‌గా మారింది. నా జీవితం, నా కొడుకు, నా మధురమైన ఆత్మ అయాన్ చాలా పుట్టినరోజులు జరుపుకోవాలి. రాబోయే రోజులు అయాన్ జీవితంలో ఆనందాన్ని, ప్రేమను, నవ్వును తీసుకురావాలంటూ ఓ హార్ట్ టచింగ్ కోట్‌తో అయన్‌తో కలిసి ఉన్న ఓ ఫొటోను షేర్ చేశాడు బన్నీ. అయితే తొలి సారి తన కొడుకుపై ఉన్న ప్రేమను ఇలా సోషల్ మీడియాలో పంచుకోవడంతో ఈ పోస్ట్ ప్రస్తుతం ట్రెండింగ్‌గా మారింది.