Ashu Reddy: నీకు అది కూడా వస్తుందా…! అంటూ అషు రెడ్డి పై యాంకర్ రవి షాకింగ్ కామెంట్!

Ashu Reddy: బిగ్ బాస్ సీజన్ 3 తో అషు రెడ్డి బాగా ఫేమస్ అయింది. అంతకుముందు డబ్ స్మాష్ లు చేస్తూ సమంత డూప్ లాగా నటిస్తున్న సంగతి అందరికి తెలిసిన అషూ..బిగ్ బాస్ తర్వాత జోరు పెంచి అవకాశాలని సద్వినియోగం చేసుకుంటోంది. ఈవెంట్స్ లోను టీవీ ప్రోగ్రామ్స్ తో రచ్చ చేస్తోంది.
ఇవే కాకా అప్పుడప్పుడు ఫోటో షూట్స్ తో సోషల్ మీడియ లో వైరల్ అవుతోంది. రీసెంట్ గా రవితో బైక్ రైడ్ చేస్తూ చేసిన రీల్స్, ఫొటోస్ తెగ వైరల్ అయ్యాయి.

అషు రెడ్డి ప్రస్తుతం ఒక సినిమా కూడా చేస్తోంది. అసుర విజయశంకర్ కలిసి నటిస్తున్న సినిమా ఫోకస్. దీంట్లో సుహాసిని మణిరత్నం కూడా ఒక కీలక పాత్రలో నటిస్తున్నారు. ఇక బుల్లితెరపై యాంకర్ గా కూడా బిజీ బిజీ గా కనిపిస్తోంది. ఇంత బిజీలో కూడా ఇంస్టాగ్రామ్ లో తను ఫోటోలు షేర్ చేస్తూ వైరల్ అవుతూనే ఉంటుంది. ఈ మధ్య ఒక చిరిగిన డ్రెస్ తో ఫోటో షేర్ చేసి వైరల్ అయిన విషయం తెలిసిందే.ప్రస్తుతం అయితే వరుడు కావలెను….. సిగ్గు వస్తుంది ఎందుకో, అనే కామెంట్ తో ఒక ఫోటో షేర్ చేసింది.

ఈ విషయంపై స్పందించిన యాంకర్ రవి నీకు అది కూడా వస్తుందా అంటూ కామెంట్ పెట్టాడు. దీంతో ఒక్కసారిగా అషురెడ్డి పరువు పోయినంత పని అయ్యింది. ఇలా నిత్యం ఏదో ఒక విషయంలో సోషల్ మీడియాలో ట్రెండింగ్ అవుతూ.. అప్పుడప్పుడు నెటిజన్స్ ట్రోలింగ్స్ సైతం గురి అవుతూ ఉంటుంది.. మొత్తానికి సోషల్ మీడియా, పలు కార్యక్రమాలు ఫోటోషూట్లో ద్వారా అషు రెడ్డి ఎంతో బిజీగా ఉన్నారని చెప్పవచ్చు.