Supritha: తెలుగు సినిమా ప్రేక్షకులకు ఈగురించి ప్రత్యేకంగా పరిచయాలు అక్కర్లేదు. క్యారెక్టర్ ఆర్టిస్టుగా ఏ పాత్రలోనైనా అలవోకగా ఒదిగిపోయే తత్వం గల నటి ఆమె. ఇంతకీ ఆమె ఎవరనకున్నారు సురేఖా వాణి. ఎన్నో సినిమాల్లో వదినగా, తల్లిగా, అక్కగా అనేక పాత్రలలో నటించి ప్రేక్షకులకు దగ్గరైన ఈమె తనకంటూ ఓ ఇమేజ్‌ను సొంతం చేసుకున్నారు. అయితే అదే స్థాయిలో ఈమెతో పాటు ఈమె కూతురు సుప్రీత కూడా తెలుగు ఆడియన్స్‌కు దగ్గరైంది.
అదెలా అంటే సోషల్ మీడియాలో ఎప్పుడూ యాక్టివ్‌గా ఉంటూ, వెరైటీ ఫోజులతో పెట్టే పోస్టులతో ఇన్స్‌స్ట్రాంలో ఎప్పుడూ వైరల్‌గా మారుతూనే ఉంటారు. దీంతో ఆమెకు సామాజిక మాధ్యమల్లో విపరీతమైన ఫాలోయింగ్ వచ్చేసింది. వీళ్లు పెట్టే గ్లామరస్ ఫొటోలతో కూడిన పోస్టులు చూసి మరికొందరు వాళ్లకు వ్యతిరేకంగా కామెంట్స్ పెట్టడం మామూలే. అయినా కూడా అవేమీ పట్టించుకోకుండా వాళ్లకు నచ్చిన ఫొటోలతో, పొట్టి డ్రెస్సులతో కూడిన పోస్టులు పెడుతూ చేసే రచ్చ అంతా ఇంతా కాదు.
ఇక సినిమాల్లో కంటే సోషల్ మీడియాలోనే ఎక్కువ ఎక్స్‌పోజ్ చేసే ఈ తల్లీ కూతుళ్లపై వచ్చే నెగెటివ్ కామెంట్స్‌ను పట్టించుకోని వారు, ప్రస్తుతం సురేఖ కూతురు సుప్రిత వాళ్ల వస్త్రధారణపై ట్రోల్ చేసే వారిపై సీరియస్‌గా రియాక్ట్ అయ్యింది. తమపై ఎన్ని కామెంట్స్ వచ్చినా వాటిని పట్టించుకోవద్దని తన అమ్మకు ఎప్పుడూ చెప్తూ ఉంటానని, కానీ కొన్ని సందర్భాల్లో కొందరు మరీ మితిమీరి చేసే కామెంట్స్ వల్ల తాము చాలా బాధపడతామని ఆమె చెప్పుకొచ్చారు. నాన్న చనిపోయిన తర్వాత అమ్మ ఇంట్లోనే ఉండేదని, తన బాధను చూడలేక తనను ఓ సారి తనను ఓ పార్టీకి తీసుకెళ్లి ఆ ఫొటోలను సోషల్ మీడియాలో పెట్టుకుంటే అంతా అసలు మీకు బాధ లేదు.. బాధ్యత లేదు అంటూ కామెంట్లు చేశారని ఆమె ఆవేదన వ్యక్తం చేశారు. అయినా మేం ఎలాంటి డ్రెస్సులు వేసుకుంటే ఏంటీ, వాళ్లేం మాకు తిండి పెట్టడం లేదు కదా.. ఖర్చులకు డబ్బులు ఇవ్వడం లేదు కదా అంటూ ఆమె మండిపడింది. మా నాన్న చనిపోయినపుడు తామెంత బాధపడ్డామో తమకు మాత్రమే తెలుసునని, పైకి నవ్వుతున్నామంటే బాధ లేనట్టా అని ఆమె ప్రశ్నించింది. తమకు ఎవరూ లేరన్న ఆమె.. మేం వేసుకునే డ్రెస్‌ను బట్టి మా క్యారెక్టర్ని ఎలా నిర్ణయిస్తారని సుప్రిత తీవ్రం ఆగ్రహం వ్యక్తం చేసింది.