Sidhu jonnalagadda : తారక్ అన్న అవార్డు ఇచ్చేసావ్ అంటున్న డీజే టిల్లు…!

 

Sidhu Jonnalagadda: ఆర్ఆర్ఆర్ సినిమా దర్శకుడు రాజమౌళి ప్రతిభతో ఇంకా ఎన్టీఆర్ చరణ్ నటన తో ఎంతటి ఘన విజయం సాధించిందో అందరికి తెలిసిందే. అయితే ఈ సినిమాకు సంబంధించిన ప్రతి విషయంలోనూ దర్శకుడు నటులు చాలా జాగ్రత్తలు తీసుకున్నారు. సినిమా విడుదలకు ముందు ప్రమోషన్లు కోసం అయితే మరీ జాగ్రత్త పడ్డారు. ప్రమోషన్ లో భాగంగా ఫ్రీ రిలీజ్ వేడుకలు, పాటలను విడుదల చేయడం,అలాగే దేశవ్యాప్తంగా దర్శకుడు హీరోలు కలిసి తిరిగి ప్రమోషన్ చేశారు. ప్రమోషన్ లో భాగంగా ముగ్గురు ఇంటర్వ్యూలు చిట్ చాట్ లు అంటూ అందరి చూపు సినిమా వైపు ఉండేలా చూసుకున్నారు.

ఇలా ఇంటర్వ్యూలు ఇస్తున్నప్పుడు ఒక ఇంటర్వ్యూలో ఇద్దరు హీరోలు ఇతర సినిమాల గురించి కూడా సంభాషించారు.అందులో ముఖ్యంగా డీజే టిల్లు సినిమాను ఉద్దేశించి జూనియర్ ఎన్టీఆర్ ప్రత్యేకంగా ఓ ఇంటర్వ్యూలో ప్రస్తావించిన విషయం తెలిసిందే కదా. డీజే టిల్లు సినిమాలో హీరోగా నటించిన సిద్ధూ చాలా బాగా నటించాడని.. టీవీ ద్వారా పరిచయం అయి ఇప్పుడు సిల్వర్ స్క్రీన్ కి వచ్చి మెప్పించడం, ఈ సినిమాలో సిద్దు నటనను తాను బాగా ఎంజాయ్ చేశా అని ఆ ఇంటర్వ్యూలో చెప్పుకొచ్చాడు ఎన్టీఆర్.


అయితే ఎన్టీఆర్ చెప్పిన ఆ మాటలను పోస్ట్ చేస్తూ కృతజ్ఞతలు చెబుతూ తన ఆనందాన్ని వ్యక్తపరిచాడు మన డీజే టిల్లు హీరో సిద్దు జొన్నలగడ్డ. ఈ మేరకు సిద్ధూ సోషల్ మీడియా వేదికగా..’ ఎన్టీఆర్ అన్న నా ఫస్ట్ అవార్డ్ చేసావా అన్న. చాలా చాలా థ్యాంక్స్.ప్రస్తుతం సూపర్ డూపర్ హ్యాపీగా ఉన్నాను. అసలు మాటలు దొరకడం లేదు. మిమ్మల్ని టైగర్ అని అందుకే అంటారు. బిగ్ బిగ్ హగ్ అండ్ ప్రేమతో’ అంటూ ఆసక్తికర పోస్ట్లు పెట్టాడు ఈ యంగ్ హీరో. ఇక ప్రస్తుతం హీరో చేసిన పోస్టులు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.