యాంకర్ ప్రదీప్ కారణంగా తల్లి చేత తిట్లుతిన్న డీజే టిల్లు హీరో!

సిద్ధు జొన్నలగడ్డ ఈ పేరు గురించి చెబితే చాలామంది ఆ హీరో ఎవరు అంటూ ఆలోచిస్తారేమో కానీ,డీజే టిల్లు అంటే మాత్రం ఇట్టే గుర్తు పడతారు. ఈయన ఇండస్ట్రీలోకి వచ్చి దాదాపు దశాబ్ద కాలం పూర్తి అయినప్పటికీ పలు సినిమాలలో నటించినా రాని గుర్తింపు డీజే టిల్లు సినిమా ద్వారా వచ్చిందని చెప్పాలి. ఈ సినిమాతో ఎంతో మంచి గుర్తింపు సంపాదించుకున్న సిద్దు తాజాగా బుల్లితెర కార్యక్రమంలో సందడి చేశారు. ఈ క్రమంలోనే ఈ కార్యక్రమానికి తన తల్లితో పాటు హాజరయ్యారు.

ఇక వేదిక పైకి వెళ్లిన సిద్దు జొన్నలగడ్డ చూపిస్తూ యాంకర్ ప్రదీప్ మీ అబ్బాయి వేసుకున్న ప్యాంటు చూస్తే మీకేమనిపిస్తుంది అంటూ తన తల్లిని అడిగారు. అప్పుడు సిద్దు టామ్ జీన్స్ ధరించి ఉన్నారు. ఈ క్రమంలోనే తన తల్లి మాట్లాడుతూ ప్రస్తుత కాలంలో పిల్లలు ధరించే వస్త్రధారణ గురించి మా జనరేషన్ వారికి ఎప్పటికీ అర్థం కాదు.అప్పట్లో దుస్తులు చిరిగిపోతే మేము కుట్టుకొని మరి వేసుకునే వాళ్ళమంటూ దారుణంగా వేదికపై సిద్ధు జొన్నలగడ్డను అవమానించారు.

అదేవిధంగా ప్రస్తుత కాలంలో పిల్లలు వృధాగా వారి సంపాదన మొత్తం ఖర్చు పెడుతున్నారని ఈమె యువతను ఉద్దేశించి మాట్లాడారు. మొత్తానికి ప్రదీప్ అడిగిన ప్రశ్నలకు కారణంగా సిద్దు తల్లి వేదికపై తన కొడుకుని తిట్టడంతో అక్కడున్న వారందరూ ఒక్కసారిగా ఆశ్చర్యపోయారు. సరదాగా సిద్దు జొన్నలగడ్డ తల్లి వేదికపై కొడుకుని తిట్టడంతో అక్కడున్న వారందరూ నవ్వుకున్నారు. ఇక ఈయన సినిమాల విషయానికొస్తే ఈయన నటించిన డీజే టిల్లు మంచి హిట్ కావడంతో ఆయనకు అవకాశాలు వెల్లువెత్తుతున్నాయి.