రోజాకే దిమ్మ తిగిరే పంచ్… అలా అనడంతో తోకముడిచిన బాబా భాస్కర్

బుల్లితెరపై రోజా వేసే పంచ్‌లు ఎలా ఉంటాయో అందరికీ తెలిసిందే. రోజాకు రివర్స్ పంచ్‌లు వేయడమంటే మామూలు విషయం కాదు. హైపర్ ఆది మాత్రమే ఆ సాహసం చేయగలడు. జబర్దస్త్ స్టేజ్ మీద రోజాపై సెటైర్లు వేయాలంటే అది కేవలం ఆది వల్లే అవుతుంది. అది కూడా మళ్లీ వెంటనే కవర్ చేసేసుకుంటాడు. మళ్లీ ఏదైనా తేడాలు వస్తే.. రోజా తన గన్ మెన్‌లకు చెప్పి మనల్ని వేసేయమంటుందని కూడా సెటైర్ వేస్తాడు. అలా రోజా ప్రతీసారి తాను పంచ్‌లు వేయడమే తప్పా.. తనపై తిరిగి వేసే ధైర్యం ఎవ్వరూ చేయరు.

కానీ తాజాగా బాబా భాస్కర్ రోజాకు దిమ్మతిరిగే పంచ్ వేశాడు. కొత్త ఏడాది రాబోతోన్న సందర్భంగా ఢీ, జబర్దస్త్ టీంలు కలిసి చేస్తోన్న స్పెషల్ ఈవెంట్‌లో రోజాపై బాబా మాస్టర్ పంచ్ వేశాడు. అసలు కథ ఏంటంటే.. న్యూ ఇయర్ వస్తుందని పార్టీ చేసుకోవాలని జబర్దస్త్ సభ్యులు… ఢీ స్టేజ్ కావాలని ఆ టీంకు వార్నింగ్ ఇచ్చారు. దానికి డీ టీం ఒప్పుకోకపోవడంతో అక్కడి కంటెస్టెంట్లను జబర్దస్త్ టీం కిడ్నాప్ చేసింది. ఇలా ఓ ఎమోషనల్ డ్రామాను క్రియేట్ చేశారు.

Dj 2021 New Year Special Event Roja Warning To Baba Bhaskar
DJ 2021 New Year Special Event Roja Warning To Baba Bhaskar

ఇందులో భాగంగా ఢీ స్టేజ్‌ను అప్పగించమని రోజా బెదిరించింది. హలో మాస్టర్ స్టేజ్ ఎక్కడా? అంటూ బాబా భాస్కర్‌ను రోజా ప్రశ్నించింది. దానికి జేబుల్లో వేతుక్కుంటూ.. తేలే అంటూ ఎగతాళి చేస్తూ సెటైర్ వేశాడు. బాబా భాస్కర్ చేష్టలకు రోజాకు బాగానే మండినట్టుంది. బ్యాక్ గ్రౌండ్‌లో గన్ సౌండ్స్‌ను పెట్టారు. ఆ సౌండ్‌లను విన్న ప్రదీప్.. ఏంటి మేడమ్ ఆ సౌండ్స్ అని అడిగాడు. బయట కూడా ఇలాంటి చెత్త పంచ్ ఎవడో వేసి ఉంటాడు.. అందుకే మా గన్ మెన్ కాల్చేసి ఉంటాడు అని రోజా చెప్పింది. దీంతో దెబ్బకు తోక ముడిచిన బాబా భాస్కర్ ప్రదీప్ వెనకాలకు వెళ్లి దాక్కున్నాడు. మొత్తానికి ఈ ఈవెంట్ బాబా భాస్కర్‌ రాకతో సందడిగా మారేలా కనిపిస్తోంది.

Related Articles

Gallery

- Advertisement -

Recent Articles