“విక్రమ్” లో సంతానంపై డిస్టబింగ్ సీన్ ఆపేశారట.!

గత ఏడాది మన సౌత్ నుంచి వచ్చిన క్రేజీ హిట్ సినిమాల్లో ఉలగనయగన్ కమల్ హాసన్ హీరోగా దర్శకుడు లోకేష్ కనగ రాజు ల కాంబినేషన్ లో వచ్చిన సెన్సేషనల్ ఇండస్ట్రీ హిట్ సినిమా “విక్రమ్” కూడా ఒకటి. తెలుగు మరియు తమిళ్ సహా పాన్ ఇండియా లెవెల్లో రిలీజ్ అయ్యిన ఈ సినిమా తెలుగు మరియు తమిళ్ మరియు కేరళ లో కమల్ హాసన్ కెరీర్ లోనే బిగ్గెస్ట్ హిట్ గా నిలిచింది.

మరి ఈ సినిమా లో కమల్ హాసన్ తో పాటుగా మరో స్టార్ నటులు మక్కల్ సెల్వం విజయ్ సేతుపతి మరియు ఫహద్ ఫాజిల్ లు సూపర్ రోల్స్ చేశారు. ఇక ఈ సినిమాలో విజయ్ సేతుపతి చేసిన సంతానం రోల్ ని ఎవరు అంత త్వరగా మర్చిపోలేరు. ఆ రోల్ లో తాను చూపించిన బాడీ లాంగ్వేజ్ గాని తన యాటిట్యూడ్ గాని నెక్స్ట్ లెవెల్లో వచ్చాయి.

అయితే ఈ సినిమాలో విజయ్ సేతుపతి పై ఓ క్రూరమైన డిస్టబింగ్ సీన్ ని ప్లాన్ చేసి ఆపేశారట. ఆ సీన్ ఫహద్ రోల్ కి ఉండే గర్ల్ ఫ్రెండ్ ని కార్ లో చంపేసే సీన్. ఈ సినిమాలో తన గర్ల్ ఫ్రెండ్ తల లేకుండా కనిపిస్తుంది. కానీ అక్కడ ఆమె తల నరికేసి సంతానం ఆమె తలని తన చేత్తో పెట్టుకొని వెళ్లే విజువల్ కూడా ఉంటుందట.

అది తన రోల్ లో అంత క్రూరంగా ఉంటుంది అని చూపించాడని దర్శకుడు ప్లాన్ చేసాడట. కానీ మళ్ళీ దీని వల్ల ఫామిలీ ఆడియెన్స్ ఎక్కడ డిస్టబ్ అవుతారో అని అలోచించి ఆ సీన్ ని అక్కడే ఆపేశారట. ఒకవేళ ఇదే సీన్ ఉండి ఉంటే సంతానం మార్క్ లో ఎలా ఉంటుందో ఊహించుకోవచ్చు.