ప్రభాస్‌తో దిశాపటానీ సెల్ఫీ!

పాన్‌ ఇండియా స్టార్‌ ప్రభాస్‌ కథానాయకుడిగా తెరకెక్కుతున్న తాజా చిత్రం ‘కల్కి 2898 ఏడీ’ సైన్స్‌ ఫిక్షన్‌ జానర్‌లో వస్తున్న ఈ చిత్రానికి ‘మహానటి’ సినిమా ఫేమ్‌ నాగ్‌ అశ్విన్‌ దర్శకత్వం వహిస్తున్నాడు. ఈ సినిమా భారతీయ పురాతన ఇతిహాసం మహాభారతం కాలం నుంచి ప్రారంభమై 2898 సంవత్సరంతో పూర్తయ్యే స్టోరీతో ఈ మూవీ రానుంది. ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్‌ శరవేగంగా జరుపుకుంటున్న విషయం తెలిసిందే.

కాగా ఇటీవల చిత్ర యూనిట్‌.. ప్రభాస్‌ అండ్‌ దిశా పటానీపై ఒక సాంగ్‌ చిత్రీకరణకోసం ఇటలీ వెళ్లారు. ఇటలీలోని ఓ ఐలాండ్‌లో ప్రభాస్‌, దిశాపటానీపై వచ్చే రొమాంటిక్‌ సాంగ్‌ తెరకెక్కిస్తున్నారు. ఇక ఆ షూటింగ్‌ సెట్స్‌ నుంచి మూవీ టీం, టెక్నికల్‌ వర్కింగ్‌ ఫోటోలు కొన్ని వచ్చి ఇప్పటికే వైరల్‌ అయ్యాయి.

అయితే ఈ పాటకు సంబంధించి షూటింగ్‌ కంప్లీట్‌ అయ్యినట్లు తెలుస్తుంది. దీనికి సంబంధించి తాజాగా ఆ షూటింగ్‌ లోకేషన్‌లో ఉన్న ఫొటోలను దిశా దిశాపటానీ సోషల్‌ విూడియాలో షేర్‌ చేసింది. ఇక ఈ ఫొటోలలో ప్రభాస్‌లో సెల్ఫీ కూడా దిగింది దిశాపటానీ. దీనితో పాటు ఇటలీలోని అందమైన లోకేషన్‌ ఫొటోలను తన ఇన్‌స్టాలో పంచుకుంది ఈ భామ. కాగా ప్రస్తుతం ఈ సెల్ఫీ ఫోటో నెట్టింట వైరల్‌ అవుతోంది.