Disastrous Radhe Shyam Got Again Profits : ఈ ఏడాదికి మొదటి పాన్ ఇండియా సినిమాగా ఎన్నో అంచనాలు నడుమ విడుదల కాబడిన భారీ సినిమా “రాధే శ్యామ్”. పాన్ ఇండియా స్టార్ హీరో ప్రభాస్ నటించిన ఈ సినిమా దాదాపు మూడేళ్ళ తర్వాత రిలీజ్ అయ్యి అనుకున్న రీతిలో అంచనాలు అందుకోలేక ఇండియా లోనే ఒక బిగ్గెస్ట్ డిజాస్టర్ సినిమాగా నిలిచిపోయింది.
దీనితో ఇండియాలో ఏ సినిమా కూడా ఇవ్వని లాసులు ఈ సినిమా మిగిల్చి ఇండస్ట్రీలో హాట్ టాపిక్ గా మారింది. అయితే మరి ఇలా డిజాస్టర్ అయ్యిన సినిమా కూడా ఇప్పుడు మరింత లాభాన్ని ఆర్జించింది అట. ఇదేలాగో తెలుస్తుంది.
ఈ సినిమా థియేట్రికల్ హక్కులు వసూళ్లు పక్కన పెడితే ఓటిటి నుంచి మరియు శాటిలైట్ హక్కులతో 200 కోట్లు లాభంగా నిర్మాతలకి రాగా ఇప్పుడు మరో 25 కోట్లు అదనంగా చేరాయట. ఇదెలా అంటే ఈ సినిమా రిలీజ్ అయ్యిన 20 రోజులకే అమెజాన్ ప్రైమ్ వీడియోలో స్ట్రీమింగ్ కి వచ్చేసింది.
అయితే దీనికి గాను ఒప్పందం కన్నా ముందే ప్రైమ్ వీడియో వారు మళ్ళీ యూవీ క్రియేషన్స్ తో డీల్ కుదుర్చుకోగా ఈ ఎర్లీ ప్రీమియర్ కోసం ఏకంగా 25 కోట్లు చెల్లించారట. దీనితో డిజాస్టర్ అయ్యిన ఈ సినిమాకి మళ్ళీ లాభం చేకూరింది అని ఇండస్ట్రీ వర్గాలు చెబుతున్నాయి. మరి ఈ సినిమాని దర్శకుడు రాధాకృష్ణ తెరకెక్కించగా పూజా హెగ్డే హీరోయిన్ గా నటించిన సంగతి తెలిసిందే.