సాయి ధరమ్ తేజ్ కోసం సిద్దమైన రాజమౌళి..?

టాలీవుడ్ లో మళ్ళీ సినిమాల సందడులు మొదలు కాబోతున్నాయి. ప్రీ రిలీజ్ ఈవెంట్స్, సక్సెస్ మీట్, బాక్సాఫీస్ రికార్డులతో రోజుకో విధంగా సెలబ్రేట్ చేసుకునే సినీ తారలు గత ఏడెనిమిది నెలలుగా అలాంటి వేడుకలకు దూరమైన విషయం తెలిసిందే. ఇక ఫైనల్ గా థియేటర్స్ ఓపెన్ కావడంతో ఎప్పటిలానే సినిమా వేడుకలు కూడా మొదలు కాబోతున్నాయి.

sai dharam tej comments on solo brathuke so better and personal life
 

మొదట మెగా హీరో సాయి ధరమ్ తేజ్ భారీ స్థాయిలో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాడు. సోలో బ్రతుకే సో బెటర్ సినిమా ఈ నెల 25న రిలీజ్ కాబోతోంది. లాక్ డౌన్ తరువాత అత్యదిక థియేటర్స్ లో విడుదల అవుతున్న మొదటి సినిమా ఇదే. ఇక సినిమాకు సంబంధించిన ఒక ఇంపార్టెంట్ గాసిప్ హాట్ టాపిక్ గా మారింది. సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ కోసం దర్శకధీరుడు రానున్నట్లు తెలుస్తోంది.

దర్శకుడు ఎస్ఎస్.రాజమౌళి చిత్ర నిర్మాత బివిఎస్ఎన్. ప్రసాద్ మంచి మిత్రులు. ఇక సోలో బ్రతుకే సో బెటర్ సినిమా యొక్క ప్రీ రిలీజ్ ఈవెంట్ ను ఈ నెల 23న ప్లాన్ చేయగా వేడుకకు రాజమౌళిని ప్రత్యేక అతిథిగా ఆహ్వానించినట్లు సమాచారం. అందుకు సంబంధించిన రూమర్స్ ఇప్పుడు సోషల్ మీడియాలో అయితే బాగానే వైరల్ అవుతున్నాయి. ఇక సినిమా ఎలాంటి ఓపెనింగ్స్ ను అందుకుంటుందో చూడాలి.