బింబిసార డైరెక్టర్.. అసలు ప్లాన్ ఏంటి?

బింబిసార మూవీతో మొదటి ప్రయత్నంలోనే బ్లాక్ బస్టర్ హిట్ సొంతం చేసుకున్న టాలెంటెడ్ డైరెక్టర్ వశిష్ట మల్లిడి. నటుడిగా కెరియర్ స్టార్ట్ చేసిన వశిష్ట మల్లిడి తరువాత డైరెక్షన్ వైపు అడుగులు వేశారు. కళ్యాణ్ రామ్ ఈ దర్శకుడు ప్రతిభ గుర్తించి మొదటి అవకాశం ఇచ్చారు. రెండు భిన్నమైన కాలాలని కలుపుతూ అద్భుతంగా సినిమాని తెరకెక్కించి సక్సెస్ అందుకున్నాడు.

కళ్యాణ్ రామ్ కెరియర్ లో కూడా బిగ్గెస్ట్ హిట్ గా ఈ మూవీ నిలిచింది. ఇప్పుడు పెద్ద పెద్ద ప్రొడక్షన్ హౌస్ లు వశిష్ట మల్లిడితో సినిమాలు చేయడం కోసం అడ్వాన్స్ ఇచ్చి మరీ సిద్ధంగా ఉన్నాయి. మెగాస్టార్ చిరంజీవితో ఇప్పటికే ఒక ప్రాజెక్ట్ కన్ఫర్మ్ అయ్యింది. సోషియో ఫాంటసీ కథతో ఈ సినిమా ఉంటుందని టాక్ వినిపిస్తోంది. ప్రస్తుతం కళ్యాణ్ కృష్ణతో చిరంజీవి సినిమా చేయనున్నారు.

దీని తర్వాత వశిష్ట మల్లిడి ప్రాజెక్ట్ ని సెట్స్ పైకి తీసుకొని వెళ్తారు. దీంతో పాటు సూపర్ స్టార్ రజినీకాంత్ కూడా ఒక సినిమా చేయడానికి కమిట్ అయ్యారు. కథ కూడా ఇప్పటికే అతనికి నేరేట్ చేసారు. అయితే రజిని ప్రస్తుతం కమిట్ అయిన ప్రాజెక్ట్స్ కంప్లీట్ అయిన తర్వాత వశిష్టతో సినిమా చేసే ఛాన్స్ ఉందంట. ఇప్పటికే ఓ బడా నిర్మాత ఈ సినిమా కోసం అడ్వాన్స్ కూడా ఇచ్చినట్లు టాక్ వినిపిస్తోంది.

ఇక బాలకృష్ణతో కూడా ఓ మైథలాజికల్ కథాంశంతో మూవీ చేయడానికి వశిష్ట కథ సిద్ధం చేసుకున్నారంట. ఈ చిత్రానికి కూడా నిర్మాత సిద్ధంగానే ఉన్నారు. బాలకృష్ణ ప్రస్తుతం అనిల్ రావిపూడితో మూవీ చేస్తున్నారు. దీని తర్వాత బాబీ దర్శకత్వంలో సినిమా సెట్స్ పైకి వెళ్తుంది. అనంతరం బోయపాటి డైరెక్షన్ లో సినిమా చేయనున్నారు. ఈ మూడు ప్రాజెక్ట్స్ కంప్లీట్ అయ్యాక వశిష్ట మల్లిడితో మూవీ ఉంటుందంట.

ఈ మూడింటిలో ముందుగా మెగాస్టార్ తో ఈ దర్శకుడి సినిమా స్టార్ట్ కానుంది. ఈ ఏడాది ఆఖరులో సెట్స్ పైకి తీసుకొని వెళ్లాలని అనుకుంటున్నారు. ప్రస్తుతం స్క్రిప్ట్ వర్క్ జరుగుతుందంట. త్వరలో దీనిపై క్లారిటీ వచ్చే ఛాన్స్ ఉందని ఇండస్ట్రీ వర్గాలలో వినిపిస్తోంది.