నటుడిగా లోకేశ్‌ కనగరాజ్‌ ఎంట్రీ!

తమిళ స్టార్‌ దర్శకుడు అంటే టక్కున గుర్తొచ్చే పేరు లోకేష్‌ కనగరాజ్‌. ‘మానగరం’ సినిమాతో కెరీర్‌ ప్రారంభించిన ఇతడు ‘ఖైదీ’, ‘మాస్టర్‌’, ‘విక్రమ్‌’,’లియో’ సినిమాలతో ఇండియన్‌ ఫిలిం ఇండస్టీక్రి బ్లాక్‌ బస్టర్‌లు అందించాడు. లోకేష్‌ ప్రస్తుతం రజనీకాంత్‌ హీరోగా ‘తలైవ 171’ ప్రాజెక్ట్‌ చేస్తున్న విషయం తెలిసిందే.

అయితే ‘తలైవా’ ప్రాజెక్ట్‌ మొదలు కాకముందే లోకేష్‌ నటుడిగా ఎంట్రీ ఇవ్వబోతున్నాడు. ప్రముఖ కోలీవుడ్‌ హీరోయిన్‌ శ్రుతిహాసన్‌ ‘ఇనిమెల్‌’ అనే మ్యూజిక్‌ ఆల్బమ్‌ చేస్తున్న విషయం తెలిసిందే.

ఇందులో నటీనటులుగా లోకేష్‌ కనగరాజ్‌, శ్రుతిహాసన్‌ నటిస్తున్నారు. ఇక ఈ ఆల్బమ్‌కు సంబంధించిన ప్రోమోను మేకర్స్‌ తాజాగా విడుదల చేశారు. ఇక ఈ ప్రోమోలో శృతి, లోకేష్‌ల కెమిస్టీ అదుర్స్‌ అనిపిస్తుంది. అయితే ఈ వీడియో చూసిన నెటిజన్లు షాక్‌ అవుతున్నారు. ఇది నిజంగా లోకేశ్‌ కనగరాజేనా.. అంటూ కామెంట్లు చేస్తున్నారు.