నా డ్రీమ్ ప్రాజెక్ట్ ‘ వందేమాతరం ‘ సినిమాను ఆ హీరోలతోనే తీస్తా: కృష్ణ వంశీ

ప్రముఖ టాలీవుడ్ దర్శకుడు కృష్ణవంశీ గురించి ప్రత్యేకంగా పరిచయం చేయాల్సిన అవసరం లేదు. వివాదాస్పద దర్శకుడు రామ్ గోపాల్ వర్మ వద్ద అసిస్టెంట్ డైరెక్టర్ గా పని చేసిన కృష్ణవంశీ గులాబీ సినిమా ద్వారా దర్శకుడిగా ఇండస్ట్రీకి పరిచయమయ్యాడు. ఆ సినిమా తర్వాత నాగార్జున హీరోగా నటించిన నిన్నే పెళ్ళాడుతా సినిమాతో డైరెక్టర్ గా మంచి గుర్తింపు సంపాదించుకున్నాడు. కృష్ణవంశీ దర్శకత్వం వహించిన మురారి, ఖడ్గం, చంద్రలేఖ, చందమామ వంటి సినిమాలు మంచి హిట్ అందుకున్నాయి. అయితే చాలా కాలంగా కృష్ణవంశీ బాక్సాఫీస్ వద్ద మంచి హిట్ అందుకోలేకపోతున్నాడు.

కృష్ణవంశీ చాలాకాలం తర్వాత ‘ రంగమార్తాండ ‘ సినిమాతో ప్రేక్షకుల ముందుకి రాబోతున్నాడు. ఇక గతంలో కృష్ణ వంశీకి బాలకృష్ణ 100 సినిమాకి అవకాశం వచ్చిన సమయంలోనే దిల్ రాజు నుండి కూడా మంచి ఆఫర్ వచ్చింది. బాలకృష్ణతో కృష్ణవంశీ తీయాల్సిన సినిమా అనేకసార్లు వాయిదా పడుతూ అమితాబచ్చన్ వల్ల ఆగిపోయింది. అయితే ఈ సినిమాలోని ఒక ప్రధాన పాత్రకు అమితాబచ్చన్ అయితే న్యాయం చేస్తాడని భావించిన కృష్ణ వంశీ ఆయనకి డేట్స్ కుదరకపోవటంతో కొంతకాలం ఎదురు చూసాడు. కానీ మొత్తానికి ఆ సినిమా షూటింగ్ మొదలు కాకుండానే ఆగిపోయింది. ఇలా బాలకృష్ణ 100 సినిమాతో పాటు దిల్ రాజు ఇచ్చిన ఆఫర్ కూడా మిస్సైపోయిందని కృష్ణ వంశీ వెల్లడించాడు.

అయితే తన జీవితంలో ఉన్న డ్రీమ్ ప్రాజెక్ట్ వందేమాతం సినిమాని కేవలం చిరంజివి లేదా మహేష్ బాబుతో తీయాలని కృష్ణ వంశీ ఎదురు చూస్తున్నారు. కానీ వారిద్దరూ ప్రస్తుతం వరుస సినిమాలతో బిజీగా ఉన్నారు. కానీ ఎప్పటికైనా ఆ సినిమా వారిద్దరిలోనే తీస్తాను అంటూ చెప్పుకొచ్చాడు. ఇక కృష్ణ వంశీ వ్యక్తిగత జీవితానికి వస్తే .. ఈయన ప్రముఖ హీరోయిన్ రమ్య కృష్ణని ప్రేమించి పెళ్లి చేసుకున్నాడు. వీరిద్దరికీ ఒక కుమారుడు కూడా ఉన్నారు. ఒకప్పుడు సౌత్ ఇండస్ట్రీలో స్టార్ హీరోయిన్గ గా గుర్తింపు పొందిన రమ్య కృష్ణ తన సెకండ్ ఇన్నింగ్స్ లో కూడా కీలక పాత్రలో నటిస్తూ బిజీగా ఉన్నారు. కృష్ణవంశీ దర్శకత్వం వహిస్తున్న రంగమార్తాండ సినిమాలో కూడా రమ్యకృష్ణ ప్రధాన పాత్రలో నటిస్తోంది.