Allu Arjun : ఇండస్ట్రీ బజ్ : బన్నీ మరో బిగ్గెస్ట్ ప్రాజెక్ట్ కి దర్శకుడు దొరికేశాడా..?

Allu Arjun :  ప్రస్తుతం ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ హీరోగా చేయబోతున్న భారీ సినిమా “పుష్ప ది రూల్” దీనికి ముందు పుష్ప పార్ట్ 1 వచ్చి సాలీడ్ హిట్ కావడంతో దీనిపై మంచి అంచనాలు నెలకొన్నాయి. మరి ఇదిలా ఉండగా దర్శకుడు సుకుమార్ వచ్చే మార్చ్ లేదా ఏప్రిల్ నుంచి సినిమా షూట్ ని స్టార్ట్ చేయనున్నారు. ఇక ఈ సినిమా లైన్ లో ఉండగానే ఐకాన్ స్టార్ ని ఓ భారీ నిర్మాణ సంస్థ సంప్రదించినట్టుగా టాక్ వచ్చిన సంగతి తెలిసిందే..

వారే 2.0, భారతీయడు 2 లాంటి భారీ సినిమాలు నిర్మాణం వహించి ఇప్పుడు ట్రిపుల్ ఆర్(RRR) సినిమా హక్కులు తమిళ్ లో భారీ మొత్తంలో కొనుగోలు చేసిన నిర్మాణ సంస్థ లైకా ప్రొడక్షన్స్ వారు. వీరు అల్లు అర్జున్ తో పుష్ప విజయం చూసాక మరో భారీ పాన్ ఇండియన్ సినిమాని హై బడ్జెట్ లోనే ప్లాన్ చేశారని తెలిసింది.

మరి ఇది అంతా బాగానే ఉంది కానీ అసలు ఈ సినిమా ని దర్శకత్వం వహించేది ఎవరు? అనే ప్రశ్న కి కోలీవుడ్ ఇండస్ట్రీ వర్గాలు ఆసక్తికర సమాధానం ఇస్తున్నాయి. ఆ దర్శకుడు మరెవరో కాదు యంగ్ అండ్ టాలెంటెడ్ ఫిల్మ్ మేకర్ అట్లీ అట.

ఈ యువ దర్శకుడు తీసిన అన్ని సినిమాలు బాక్సాఫీస్ దగ్గర ఎలాంటి విజయాలు అందుకున్నాయో తెలిసిందే. మరి అలాంటి ఈ దర్శకుడు తో బన్నీ సినిమా అంటే మరిన్ని అంచనాలు నెలకొంటాయి. మరి వేచి చూడాలి ఈ కాంబో ఎంతవరకు నిజం అవుతోంది అనేది. ప్రస్తుతం అయితే ఐకాన్ స్టార్ పుష్ప సక్సెస్ ని ఎంజాయ్ చేస్తున్నాడు.