బాలయ్య అభిమానులకు క్షమాపణలు చెప్పిన దర్శకుడు గోపీచంద్ మలినేని… ఎందుకంటే?

1034471-gopichand

టాలీవుడ్ ఇండస్ట్రీలో దర్శకుడిగా గుర్తింపు పొందిన గోపీచంద్ మలినేని ఇటీవల క్రాక్ సినిమా ద్వారా బ్లాక్ బస్టర్ హిట్ అందుకున్నాడు. ఆ సినిమా హిట్ అవటంతో బాలయ్య ని డైరెక్ట్ చేసే అవకాశం దక్కించుకున్నాడు. ఈ క్రమంలో బాలకృష్ణ హీరోగా గోపీచంద్ మలినేని దర్శకత్వంలో వీరసింహారెడ్డి అనే సినిమా తెరకెక్కింది. ఈ సినిమా షూటింగ్ పూర్తి చేసుకుని విడుదలకు సిద్ధంగా ఉంది. జనవరి 12వ తేదీ సంక్రాంతి కానుకగా ఈ సినిమాని విడుదల చేయనున్నారు. విడుదల తేదీ దగ్గర పడటంతో ఇటీవల ఒంగోలులో ఫ్రీ రిలీజ్ ఈవెంట్ ఘనంగా నిర్వహించారు. తాజాగా ఈ సినిమా నుండి ‘మాస్ మొగుడు’ అనే మరొక పాటను విడుదల చేశారు.

తాజాగా జరిగిన ఈ సాంగ్ రిలీజ్ ఈవెంట్లో దర్శకుడు గోపీచంద్ మలినేని మాట్లాడుతూ బాలయ్య అభిమానులకు క్షమాపణలు తెలియజేశాడు. అయితే ఇలా క్షమాపణలు తెలియచేయడానికి కారణం ఏమిటంటే.. ఇటీవల జరిగిన ఫ్రీ రిలీజ్ ఈవెంట్ కి కొన్ని వేల సంఖ్యలో అభిమానులు హాజరయ్యారు. అయితే అక్కడ ఈవెంట్ లో పాల్గొనటానికి పోలీసులు కేవలం 20 వేల పాసులను మాత్రమే మంజూరు చేయగా దాదాపు 50 వేల మంది అభిమానులు బయట ఉండిపోయినట్లు ఇటీవల వెలుగులోకి వచ్చింది. అంతేకాకుండా ఫ్రీ రిలీజ్ ఈవెంట్లో పోలీసులు అభిమానుల మీద లాఠీ చార్జ్ చేసిన సంగతి కూడా ఇటీవల వెలుగులోకి రావడంతో తాజాగా జరిగిన ఈవెంట్ లో గోపీచంద్ మలినేని బాలయ్య అభిమానులకు క్షమాపణలు తెలియజేశాడు.

అంతేకాకుండా ఏ సినిమా పక్క హిట్ అవుతుందని నమ్మకం వ్యక్తం చేశారు. ఇదిలా ఉండగా అఖండ సినిమా బ్లాక్ బస్టర్ హిట్ అవటంతో ఈ సినిమా మీద కూడా ప్రేక్షకులు భారీ అంచనాలు పెట్టుకున్నారు. అంతే కాకుండా ఇటీవల విడుదలైన ట్రైలర్ కూడా ప్రేక్షకులను బాగా ఆకట్టుకొని వైరల్ అవుతోంది. ఇక ఈ ట్రైలర్ లో బాలయ్య యాక్షన్ సీన్స్ అభిమానుల్లో పూనకాలు తెప్పించే విధంగా ఉన్నాయి. పక్కా యాక్షన్ ఎంటర్టైనర్ గా తెరకెక్కిన ఈ సినిమా ప్రేక్షకులకు ముందే పండగ వాతావరణం ఏర్పడుతుంది. ఇక ఈ సినిమాలో శృతిహాసన్ బాలయ్య కి జోడిగా నటించగా.. వరలక్ష్మి శరత్ కుమార్ ఒక కీలక పాత్రలో నటించింది. పక్కా యాక్షన్ ఎంటర్టైనర్ గా తెరకెక్కిన ఈ సినిమా కోసం ప్రేక్షకులు ఎంతో ఆత్రుతగా ఎదురుచూస్తున్నారు.