హీరోయిన్లు తరచూ దుబాయ్ వెళ్ళేది అందుకే.. షాకింగ్ కామెంట్స్ చేసిన డైరెక్టర్?

నిన్నటి తరం దర్శకులలో ఒకరైనటువంటి గీతాకృష్ణ ప్రస్తుతం ఎలాంటి సినిమాలు చేయకపోయినా ఈయన తరచూ పలు యూట్యూబ్ ఛానల్ లకు ఇంటర్వ్యూలు పెద్ద ఎత్తున వార్తలలో నిలుస్తున్నారు. ఇప్పటికి ఎన్నో ఇంటర్వ్యూలలో పాల్గొన్న గీతాకృష్ణ ఇండస్ట్రీకి చెందిన పలువురు హీరోలు దర్శకుల గురించి పెద్ద ఎత్తున సంచలన వ్యాఖ్యలు చేశారు. ఇదిలా ఉండగా తాజాగా ఈయన క్యాస్టింగ్ కౌచ్ గురించి సంచలన వ్యాఖ్యలు చేశారు.సాధారణంగా ఇండస్ట్రీలో క్యాస్టింగ్ కౌచ్ ఉంది అనే విషయం మనకు తెలిసిందే. ఇప్పటికే ఈ విషయం గురించి ఎన్నో ఉద్యమాలు కూడా జరిగాయి.అయితే ఎంతో మంది హీరోయిన్స్ మేము ఇండస్ట్రీలో ఇలాంటి ఇబ్బందులను ఎదుర్కొన్నామని తెలిపారు.

ఈ సందర్భంగా ఈయన మాట్లాడుతూ గత కొద్ది రోజుల క్రితం నీతూ చంద్ర అనే హీరోయిన్ మాట్లాడుతూ తనకి అవకాశాలు లేకపోవడంతో ఒక వ్యాపారవేత్త ఏకంగా తనని భార్యగా ఉండమని అందుకు తనకు నెలకు 25 లక్షల జీతం ఇస్తానని చెప్పారు అంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు.ఇలా ఇండస్ట్రీలో ఎంతోమంది కాస్టింగ్ కౌచ్ గురించి ఇలాంటి వ్యాఖ్యలు చేయడంతో ఈయన స్పందిస్తూ ఒకవేళ వారి జీవితంలో ఇలాంటి ఇబ్బందులు ఎదురయ్యాయో లేదు తనకు తెలియదు కానీ ఇలాంటి వ్యాఖ్యలు చేస్తూ హీరోయిన్లు వారి మార్కెట్ పెంచుకుంటున్నారని ఈయన ఆరోపించారు.

ఇండస్ట్రీలో ఇలాంటివన్నీ సర్వ సాధారణం. ఒకవేళ వీరికి ఇష్టం లేకపోతే వారు ఇచ్చిన ఆఫర్ తిరస్కరించి అంతటితో సైలెంట్ అవ్వాలి కానీ ఇలా పబ్లిసిటీ చేసుకోవడం ఏంటి అంటూ మండిపడ్డారు. ఇకపోతే హీరోయిన్లు తరచూ దుబాయ్ వెళ్తూ ఉంటారు. ఇలా వీరందరూ దుబాయ్ వెళ్లి అక్కడ వ్యాపారవేత్తలను వివాహం చేసుకొని పిల్లల్ని కని ఇండియాకి వచ్చేస్తున్నారని, వ్యాపారవేత్తలతో పెళ్లి కోసమే వీరందరూ తరచూ దుబాయ్ వెళ్తున్నారని గీతాకృష్ణ ఈ సందర్భంగా క్యాస్టింగ్ కౌచ్ గురించి కామెంట్ చేయడంతో ఈ వ్యాఖ్యలు కాస్త వైరల్ అవుతున్నాయి.