పెళ్ళి పీటలెక్కనున్న సొట్టబుగ్గల సుందరి.!

ఆమెకు పెళ్ళంట.! ఓ పొడుగాటి హీరోతో ఎఫైర్.. అంటూ గాసిప్పులు రాగానే, ఆమె పెళ్ళి ప్రస్తావన తెరపైకొచ్చింది. అబ్బే, అదేం లేదంటూ ఆమె ఖండించింది కూడా.! పోనీ, ఆ హీరోతో ఎఫైర్ వ్యవహారమైనా ముందుకు నడిచిందా.? అంటే, అదీ లేదు.

చేతిలో సినిమాల్లేవ్.! దాంతో, చేసేది లేక.. పెళ్ళి వైపుకు దృష్టి మళ్ళించిందట ఆ అందాల భామ. త్వరలో, అతి త్వరలో పెళ్ళి పీటలెక్కబోతోందట ఆమె. ఇంతకీ ఎవరామె.? తెలుగులో తొలి సినిమాతోనే సూపర్ హిట్ కొట్టిందండోయ్.!

స్టార్ హీరోయిన్ అయితే అవలేకపోయింది. కానీ, ఆటిట్యూడ్ మాత్రం ఎక్కువే.! ఓ సీనియర్ హీరో సరసన కూడా నటించేసింది. సొట్ట బుగ్గలు స్పెషల్ ఎట్రాక్షన్.! సదరు పొడుగాటి హీరోతో ఎఫైర్ అన్న వార్తలే ఆమెను కొన్నాళ్ళు లైమ్‌లైట్‌లో వుంచాయ్. అదీ ఉత్తదేనని తేలిపోవడంతో పూర్తిగా ఫేడవుట్ అయిపోయింది. అందుకే, పెళ్ళి ప్రయత్నాలు మొదలు పెట్టిందట.