ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇవ్వనన్న దిల్ రాజు భార్య.. ఇందులో నిజమెంత?

సినిమా ఇండస్ట్రీలో నెపోటిజం ఉండడం సర్వసాధారణం.ఇలా ఇండస్ట్రీలో అగ్ర హీరో హీరోయిన్లుగా కొనసాగుతున్న వారందరూ కూడా వారి వారసులను ఇండస్ట్రీకి పరిచయం చేస్తుంటారు. అయితే ఈ మధ్యకాలంలో వారసుల ఎంట్రీ మరింత ఎక్కువగా ఉందని చెప్పాలి కేవలం హీరో వారసులు మాత్రమే కాకుండా వారి కుటుంబ సభ్యులు కూడా ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇస్తున్నారు. ముఖ్యంగా కొంతమంది హీరోల భార్యలు కూడా ఇండస్ట్రీలోకి అడుగుపెడుతున్నడం విశేషం.

ఇకపోతే టాలీవుడ్ ఇండస్ట్రీలో ప్రొడ్యూసర్ గా ఎంతో పేరు ప్రఖ్యాతలు సంపాదించుకున్న దిల్ రాజు రెండవ భార్య తేజస్విని కూడా సినిమా ఇండస్ట్రీలోకి అడుగుపెట్టబోతుందనే వార్త సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.తేజస్విని కాలేజీ రోజుల నుంచి తనకు మోడలింగ్ అంటే చాలా ఇష్టమని అయితే మోడలింగ్ రంగంలోకి అడుగు పెట్టాలని ప్రయత్నాలు చేసినప్పటికీ తన ఇంట్లో అడ్డు చెప్పారని తెలుస్తోంది. అయితే ఈమె దిల్ రాజుని పెళ్లి చేసుకోవడంతో తన కోరికను బయటపెట్టారట.

ఈ క్రమంలోనే కోట్లు ఖర్చు చేసి తనని మోడలింగ్ రంగంలోకి పంపించడానికి దిల్ రాజు అన్ని ప్లాన్స్ చేసినట్టు సమాచారం. ఇలా మోడలింగ్ రంగంలో మంచిగా రాణించిన అనంతరం ఈమెను ఇండస్ట్రీలోకి కూడా తీసుకురానున్నట్లు వార్తలు చక్కర్లు కొడుతున్నాయి. ఇండస్ట్రీలో పలు కీలక పాత్రలలో నటించే అవకాశాలుకూడా ఉన్నాయని సోషల్ మీడియాలో వార్తలు రావడంతో పలువురు ఈ వార్తలపై స్పందించి దిల్ రాజును భారీగా ట్రోల్ చేస్తున్నారు.