“సలార్” ని భారీ ధరకి దక్కించుకున్న దిల్ రాజు.!

టాలీవుడ్ సినిమా దగ్గర ఉన్న ప్రముఖ నిర్మాతలు మరియు డిస్ట్రిబ్యూషన్ లో అయితే దిల్ రాజు కోసం ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. కాగా ఇప్పుడు ఇప్పుడు పలు చిత్రాలు నిర్మాణం జరుపుతూనే మెయిన్ గా నైజాం డిస్ట్రిబ్యూషన్ లో అయితే తాను ప్రధాన పాత్ర పోషిస్తున్నారు.

రీసెంట్ గానే తమిళ భారీ పాన్ ఇండియా సినిమా “లియో” హక్కులు సొంతం చేసుకున్న దిల్ రాజు లేటెస్ట్ గా అయితే పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ నటించిన లేటెస్ట్ సెన్సేషనల్ ఏక్షన్ డ్రామా “సలార్” ని కూడా రికార్డు ఫిగర్ అందించి కొనుగోలు చేసినట్టుగా సినీ వర్గాలు చెపున్నాయి.

కాగా దిల్ రాజు నైజాం హక్కులని సొంతం చేసుకున్నారట. మరి సమాచారం ప్రకారం తాను సుమారు 70 కోట్ల మేర బిజినెస్ తో ఈ డీల్ ని లాక్ చేసుకున్నారని తెలుస్తుంది. ఇంతే కాకుండా ఇది ఆల్ మోస్ట్ నాన్ రికవరబుల్ అడ్వాన్స్ డీల్ తో కంప్లీట్ అయ్యినట్టుగా తెలుస్తుంది.

అంటే నష్టాలు వస్తే నష్టాలు భరించక తప్పదు. కానీ ఈ సినిమాకి ఉన్న హైప్ లో ఈ మాటే ఉండకపోవచ్చు. ఇక ఈ చిత్రంని అయితే దర్శకుడు ప్రశాంత్ నీల్ తెరకెక్కించగా శృతి హాసన్ హీరోయిన్ గా నటించింది. అలాగే కేజీఎఫ్ నిర్మాణ సంస్థ హోంబలే ఫిల్మ్స్ వారు నిర్మాణం వహిస్తుండగా ఈ చిత్రం గ్రాండ్ గా ఈ సెప్టెంబర్ 28న కనీ వినీ ఎరుగని రీతిలో విడుదల కాబోతుంది.