గాసిప్ : ప్రభాస్ తో దిల్ రాజు డ్రీం ప్రాజెక్ట్ ఫిక్స్.?

ఇపుడు పాన్ ఇండియా సినిమా దగ్గర ఉన్న మోస్ట్ వాంటెడ్ హీరోస్ లో పాన్ ఇండియా సూపర్ స్టార్ ప్రభాస్ కూడా ఒకరు. మరి ప్రభాస్ తో సినిమా చేయాలని ఇప్పుడు అందరి నిర్మాతలకి కూడా ఓ రేంజ్ లో ఉంటుంది. కాగా ఇప్పుడు ఆల్రెడీ కొందరు నిర్మాతలు ప్రభాస్ సినిమాకి డేట్స్ తీసుకున్నారు మరికొందరు వెయిట్ చేస్తున్నారు.

అయితే ఈ నిర్మాతల లిస్ట్ లో సక్సెస్ ఫుల్ నిర్మాత దిల్ రాజు కూడా ఉన్నారు. మొన్ననే నిర్వహించిన ట్విట్టర్ సెషన్ లో కూడా ప్రభాస్ తో సినిమా ఉందని తాను తెలిపారు. అలాగే తన డ్రీం ప్రాజెక్ట్ “జటాయు” కోసం కూడా వేరేగా ఆన్సర్ ఇచ్చారు. కానీ ఇప్పుడు అయితే ఈ డ్రీం ప్రాజెక్ట్ కి సంబంధించి మరింత సాలిడ్ క్లారిటీ తెలుస్తుంది.

గతంలో కూడా ఈ డ్రీం ప్రాజెక్ట్ ని అయితే ప్రభాస్ తోనే దిల్ రాజు ప్లాన్ చేస్తున్నట్టుగా సెన్సేషనల్ బజ్ వచ్చింది. కాగా ఈ అవైటెడ్ కాంబోలో సినిమాని దర్శకుడు ప్రశాంత్ నీల్ తెరకెక్కించనున్నట్టుగా లేటెస్ట్ గా సినీ వర్గాల్లో వినిపిస్తున్న కొత్త బజ్.

అంతే కాకుండా ఈ కాంబినేషన్ ఆల్రెడీ లాక్ అయ్యిందని అంతే కాకుండా ఇపుడు నీల్ కూడా సినిమా స్క్రిప్ట్ ని ఫైనల్ చేసే పనిలో ఉన్నారని ప్రస్తుతానికి ప్రభాస్ మరియు ప్రశాంత్ నీల్ లు ఉన్న కమిట్మెంట్స్ నుంచి కాస్త ఫ్రీ అయ్యాక అయితే ఈ మాసివ్ ప్రాజెక్ట్ స్టార్ట్ కానున్నట్టుగా తెలుస్తుంది. అయితే ఈ సినిమా ఓ భారీ మైథలాజికల్ వండర్ గా తెరకెక్కనుంది. మరి ఇదెప్పుడు స్టార్ట్ కానుంది చూడాలి మరి.