ఇండస్ట్రీ టాక్ : “ఎఫ్ 3” తో దిల్ రాజుకి ఓటిటి నుంచి కూడా భారీ లాభం అట.!

టాలీవుడ్ లో ఉన్నటువంటి మోస్ట్ సక్సెస్ ఫుల్ నిర్మాతలలో ఏస్ ప్రొడ్యూసర్ దిల్ రాజు కూడా ఒకరు. మరి దిల్ రాజు ఇప్పుడు అనేక భారీ సినిమాలు చేస్తున్న దిల్ రాజు నుంచి ఈ ఏడాది ఆల్రెడీ పలు సినిమాలు వచ్చాయి. మరి ఆ చిత్రాల్లో అయితే ఫన్ మల్టీ స్టారర్ చిత్రం “ఎఫ్ 3” కూడా ఒకటి.

అయితే ఈ సినిమాలో వెంకీ మామ మరియు వరుణ్ తేజ్ లు హీరోలుగా నటించగా మిల్కి బ్యూటీ తమన్నా మరియు మెహ్రీన్ లు హీరోయిన్స్ గా నటించారు. అయితే ఈ సినిమా కూడా బాక్సాఫీస్ దగ్గర భారీ వసూళ్లను అందుకోగా ఇప్పుడు ఈ జూలై 22న ఓటిటి లో స్ట్రీమింగ్ కి రావడానికి సిద్ధంగా ఉంది.

దిల్ రాజు చెప్పినట్టుగానే ఆల్ మోస్ట్ 8 వారాల తర్వాత ముందే స్ట్రీమింగ్ కి వస్తున్న ఈ చిత్రం దాదాపు ఆరు రోజులు ముందు సోనీ లివ్ లో వచ్చేస్తుంది. మరి ఈ కాస్త ముందు స్ట్రీమింగ్ కి కూడా దిల్ రాజుకు భారీ లాభం వచినట్టుగా ట్రేడ్ వర్గాలు చెబుతున్నాయి.

ఎఫ్ 3 కి ఈ రకంగా అదనంగా 13 కోట్లు దిల్ రాజు జేబులోకి లాభం రూపంగా వచ్చాయట. దీనితో ఈ టాక్ టాలీవుడ్ లో ఆసక్తిగా మారింది. ఇక ఈ సినిమాలో పూజా హెగ్డే మరియు సోనాల్ చౌహన్ లు కూడా కనిపించగా అనిల్ రావిపూడి ఈ సినిమాకి దర్శకత్వం వహించాడు. అలాగే దేవీశ్రీ ప్రసాద్ సంగీతం అందించిన సంగతి తెలిసిందే.