గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ తేజ్, దిగ్గజ దర్శకుడు శంకర్ కాంబినేషన్‌లో వస్తున్న తాజా చిత్రం ‘గేమ్ ఛేంజర్’. ఈ సినిమాను అగ్ర నిర్మాత దిల్ రాజు నిర్మిస్తుండగా.. థమన్ సంగీతం అందిస్తున్నాడు. ఈ సినిమా సంక్రాంతి కానుకగా జనవరి 10న ప్రేక్షకుల ముందుకు రానున్న విషయం తెలిసిందే. రామ్ చరణ్ శంకర్ దిల్ రాజు కాంబినేషన్‌లో ఈ సినిమా వస్తుండటంతో మూవీపై భారీ అంచనాలు ఉన్నాయి. అయితే ఈ సినిమా ప్రమోషన్స్‌లో భాగంగా.. ప్రీ రిలీజ్ వేడుకను ఆంధ్రప్రదేశ్‌లో నిర్వహించబోతున్న విషయం తెలిసిందే.
ఈ వేడుకకు ముఖ్య అతిథిగా ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్‌ను టీం ఇన్‌వైట్ చేయనున్నట్లు గత కొన్ని రోజులుగా వార్తలు చక్కర్లు కొట్టాయి. అయితే ఇదే విషయంపై నిర్మాత దిల్ రాజు నేడు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్‌తో మంగళగిరి జనసేన కార్యాలయంలో భేటీ అయ్యాడు. దిల్ రాజు గేమ్ ఛేంజర్ ప్రీ రిలీజ్ ఈవెంట్‌కి చీఫ్ గెస్ట్‌గా పవన్ రావాలని దిల్ రాజు కోరడంతో జనసేనాని ఒకే చెప్పినట్లు తెలుస్తుంది. ఇక ఈ ప్రీ రిలీజ్ వేడుకను జనవరి 04న రాజమండ్రిలో నిర్వహించబోతున్నట్లు సమాచారం.