Krishnam Raju Home Tour: ప్రభాస్ పెదనాన్న కృష్ణం రాజు ఇంటిని చూశారా… ఎంత అందంగా ఉందో?

Krishnam Raju Home Tour: పాన్ ఇండియా స్టార్ హీరో ప్రభాస్ నటించిన సినిమా నేడు ప్రేక్షకుల ముందుకు వచ్చింది.బాహుబలి సాహో సినిమాల తర్వాత ప్రభాస్ సినిమా విడుదల కావడంతో పెద్ద ఎత్తున సినిమాపై అంచనాలు ఏర్పడ్డాయి. ఈ క్రమంలోనే ఈ సినిమా థియేటర్లలో విడుదలై పాజిటివ్ టాక్ ను సంపాదించుకుంది. ఇకపోతే ఈ సినిమాలో ప్రభాస్ పెదనాన్న కృష్ణం రాజు కూడా పరమహంస పాత్రలో నటించిన సంగతి మనకు తెలిసిందే.ఇకపోతే ఈ సినిమా ప్రమోషన్ కార్యక్రమాల్లో భాగంగా ఒక యూట్యూబ్ ఛానల్ వారు కృష్ణంరాజు ఇంటికి వెళ్లారు. ఈ క్రమంలోనే కృష్ణంరాజు భార్య శ్యామల దేవి తన హోమ్ టూర్ చేసి చూపించారు.

ప్రస్తుతం ప్రభాస్ పెదనాన్న కృష్ణం రాజు ఇంటికి సంబంధించిన ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి. ఈ సందర్భంగా శ్యామల దేవి తన ఇంటిని చూపెడుతూ ప్రతిదీ వివరించారు.ఇక కృష్ణంరాజు ఇంట్లో అందరికీ దైవభక్తి ఎక్కువ కావడంతో ప్రతి రోజు తప్పనిసరిగా ఇంట్లో పెద్ద ఎత్తున పూజలు చేస్తామని శ్యామలాదేవి చెప్పుకొచ్చారు.అలాగేకృష్ణం రాజు గారికి పురాతన వస్తువులు అంటే ఎంతో ఇష్టం కనుక మా ఇంట్లో ఎక్కువ అలాంటి వస్తువులే కనిపిస్తాయని ఈమె తెలియజేశారు.

ఇక ఈ ఇంటిలో సెంటర్ అఫ్ అట్రాక్షన్ గా గత 30 సంవత్సరాల క్రితం ఇటలీ నుంచి తెప్పించిన 24 క్యారెట్ల బంగారం పులి బొమ్మ గురించి శ్యామల దేవి చెప్పుకొచ్చారు.ఈ విగ్రహాన్ని పూర్తి స్వచ్ఛమైన బంగారంతో తయారు చేశారని ఇలాంటి పులి బొమ్మలు చాలా అరుదుగా ఉంటాయని ఈమె వెల్లడించారు.ఇక ఆ పులి బొమ్మ ప్రత్యేకత ఏమిటంటే యాభై సంవత్సరాల తర్వాత తిరిగి దీనిని సరి కొత్తగా రూపొందిస్తారని తెలిపారు. ఇలా శ్యామల దేవి తన హోమ్ టూర్ చేసి చూపించడంతో ప్రస్తుతం ఈ ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి.