విజయనిర్మలను వద్దంటే చివరికి ఎస్వీఆర్ ని తీసేసారా.. విజయనిర్మలకు అంత క్రేజ్ ఉండేదా?

తెలుగు చిత్ర పరిశ్రమలో ఎన్టీఆర్ ఏఎన్ఆర్ తర్వాత ఎస్విఆర్ అంతే స్థాయిలో ఆదరణ సంపాదించుకుని ఎంతో మంచి గుర్తింపు పొందారు.ఇలా ఇండస్ట్రీలో ఈ హీరోలతో పాటు దీటుగా విజయనిర్మల కూడా ఎన్నో సినిమాలలో నటించి సందడి చేశారు.విజయనిర్మల కేవలం నటిగా మాత్రమే కాకుండా దర్శకురాలిగా నిర్మాతగా కూడా ఇండస్ట్రీలో చెరగని ముద్ర వేసుకున్నారు. ఇండస్ట్రీలో విజయనిర్మలకు ఎలాంటి క్రేజ్ ఉండేదో షావుకారు సినిమాలో ఈ ఒక్క ఘటనతో తెలిసిపోతుంది.

తెలుగు సినిమా ఇండస్ట్రీలో అద్భుతమైన విజయాన్ని అందుకున్న సినిమాలలో షావుకారు ఒకటి. ఈ సినిమాలో ఎస్వీఆర్ కోడలు పాత్రలో నటించడానికి విజయనిర్మలను ఎంపిక చేశారు.అయితే విజయనిర్మలను చూసినటువంటి ఎస్వీఆర్ ఈమె ఏంటి ఇలా ఉంది ఈమె తన సినిమాలో వద్దు అని కరాకండిగా చెప్పేసారట. ఇలా చెప్పడంతో విజయనిర్మల ఇంత మంచి సంస్థలో సినిమా చేసే అవకాశం కోల్పోవడంతో బాగా ఏడ్చారని తెలుస్తోంది.ఇలా ఈ సినిమాలో అవకాశం కోల్పోవడంతో బాధపడుతున్నటువంటి ఈమెకు మరుసటి రోజు ఉదయం నిర్మాత నాగిరెడ్డి తనకోసం కారు పంపించడంతో ఆశ్చర్యపోయారట.

ఇలా తన కోసం కారు రావడంతో ఆశ్చర్యంగా కారులో షూటింగ్ లోకేషన్ కు వెళ్లినటువంటి విజయనిర్మలకు అక్కడ చిన్న షాక్ తగిలింది. తనని సినిమాలో వద్దని చెప్పిన ఎస్వీఆర్ స్థానంలో మరొక నటుడు ఎస్వి సుబ్బారావు ఉండడం చూసి ఈమె షాక్ అయ్యారట. విజయనిర్మల అంత బాగుంటే ఎస్విఆర్ వద్దనడం ఏంటి అని ఆలోచించిన నాగిరెడ్డి గారు తిరిగి ఎస్.వి.ఆర్ ను సినిమా నుంచి తప్పించి,విజయనిర్మలను తీసుకోవడం విశేషం ఈ ఒక్క ఘటనతోనే విజయనిర్మలకు ఇండస్ట్రీలో ఎలాంటి క్రేజ్ ఉందో అర్థమవుతుంది.