మహానటి సావిత్రి చనిపోయే ముందు అలాంటి కోరిక కోరిందా.. తెలిస్తే షాక్ అవ్వాల్సిందే?

తెలుగు సినిమా ఇండస్ట్రీలో ఒకానొక దశలో చిత్ర పరిశ్రమను ఏలిన నటి సావిత్రి గురించి పరిచయం అవసరం లేదు.అగ్ర హీరోలైన ఎన్టీఆర్ ఏఎన్నార్ ఎస్వీఆర్ వంటి హీరోలు ఆమె సరసన నటించడం కోసం ఎన్నో జాగ్రత్తలు తీసుకొని ఎంతో భయంగా నటించేవారు.ఇలా సినిమా ఇండస్ట్రీలో ఎన్నో అద్భుతమైన పాత్రలలో నటించి మహానటి అనే బిరుదు సంపాదించుకున్న సావిత్రి ఎన్నో అద్భుతమైన సినిమాలలో చేసినప్పటికీ తనకు ఒక్క అవార్డు కూడా రాకపోవడం గమనార్హం.

తన నటనకు అవార్డులు రాకపోయినా ఎంతో మంది ప్రేక్షక అభిమానులు తనకు మహానటి అనే బిరుదు ఇచ్చారు. అదే తనకు గొప్ప కానుక అంటూ ఈమె ఎంతో మురిసిపోయేది.ఇండస్ట్రీలో అగ్రతారగా వెలిగిన ఈమె కోట్ల సంపదను సంపాదించినప్పటికీ దానధర్మాల పేరుతో ఆస్తిని మంచులా కరిగించేశారు.అందరిని గుడ్డిగా నమ్మి చివరికి ఒంటరిగా జీవితాన్ని అనుభవిస్తూ ఎంతో క్లిష్టతరమైన దుర్భర పరిస్థితిలలో మృతి చెందారు. అయితే ఎప్పుడు అందరికీ దానం చేసే ఈమే చివరిగా తన చివరి రోజులలో ఒకే ఒక కోరిక కోరారు.

ఈ సందర్భంగా ఈమె తన చివరి కోరికను తెలియజేస్తూ తాను నటించిన చివరికి మిగిలేదిదే అనే సినిమాకు జాతీయ అవార్డు రావాలని కోరుకున్నారు. అలాగే తాను మరణించిన తర్వాత తన సమాధిపై ఏమి రాయాలో కూడా ఈమె వివరించినట్లు తాజాగా ప్రముఖ ఫిలిం క్రిటిక్ నందగోపాల్ ఓ ఇంటర్వ్యూలో వివరించారు. తాను మరణించిన తర్వాత తన సమాధిపై సినిమాలలోను నిజజీవితంలోనూ మహోన్నతరమైనతార ఇక్కడ విశ్రాంతి తీసుకుంటుంది. ఇక్కడకు ఎవరొచ్చినా సానుభూతితో తనకు కన్నీళ్లు కార్చవద్దని కేవలం ఒక పూలమాల తన సమాధిపై పెట్టాలని పెట్టాలని రాయమంటూ తన చివరి కోరికను కోరారట. ఈ విధంగా సావిత్రి చివరి కోరిక గురించి ఈయన చెప్పిన కామెంట్స్ వైరల్ అవుతున్నాయి.