సీతారామం హీరోయిన్ డాక్టర్ అని మీకు తెలుసా.. ఈమె యాక్టర్ గా మారడానికి అదే కారణమా?

సాధారణంగా కొంతమంది ఓవర్ నైట్ లో సెలబ్రిటీలుగా మారిపోతూ ఉంటారు. ఇలా ఒకే ఒక్క సినిమాతో హీరోయిన్ గా మంచి గుర్తింపు తెచ్చుకున్న వారిలో మృణాల్ ఠాకూర్ కూడా ఒకరు. ఇటీవల విడుదలైన సీతారామం సినిమాలో దుల్కర్ సల్మాన్ సరసన సీత పాత్రలో నటించి తన అందం, అభినయంతో అందరినీ మెప్పించింది. ఇలా హీరోయిన్ గా నటించిన మొదటి సినిమాతోనే మంచి గుర్తింపు పొంది వరుస సినిమా అవకాశాలు అందుకుంటోంది. టాలివుడ్ లో స్టార్ హీరో సరసన నటించే అవకాశం అందుకున్నట్లు తెలుస్తోంది.

మొదట బుల్లితెర నటిగా తన కెరీర్ ప్రారంభించిన మృణాల్ ఠాకూర్ తర్వాత సీతారామం సినిమా ద్వారా మొదటిసారిగా హీరోయిన్ గా అవకాశం పొందింది. ఈ సినిమా ద్వార టాలివుడ్ ప్రేక్షకులను ఒక్కసారిగా తనవైపు తిప్పుకుంది. ఇదిలా ఉండగా ఇటీవల ఒక ఇంటర్వ్యూలో పాల్గొన్న మృణాల్ తన వ్యక్తిగత జీవితం గురించి అనేక విషయాలు వెల్లడిస్తూ..ఇండస్ట్రీ
కి ఎలా ఇచ్చిందన్న విషయాల గురించి ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేసింది. ఈ ఇంటర్వ్యూలో మృణాల్ మాట్లాడుతు… డాక్టర్ అవ్వాల్సిన నేను యాక్టర్ అయ్యాను. నిజానికి నేను డెంటిస్ట్‌ కోర్స్‌ చేశాను. అందుకోసం రాసిన ప్రవేశ పరీక్షలో మంచి మార్కులు కూడా వచ్చాయి. అయితే నాకు డాక్టర్ కన్నా నటి అవ్వాలనే కోరిక బలంగా ఉండేదని వెల్లడించింది.

అయితే అమ్మానాన్న అందుకు ఒప్పుకునే వారు కాదు. ఎలాగైనా వారిని ఒప్పించాలనే ప్రయత్నంలో ఓరోజు వారికి ‘త్రీ ఇడియట్స్‌’ ను చూపించా. అందులో నచ్చిన పని చేయడంలో ఉన్న సంతోషం, నచ్చిన పనే చేయాలనే సందేశం వారికి నచ్చింది. ఆ సినిమా చూసిన తర్వాతే స్వయంగా అమ్మానాన్నే నన్ను ప్రోత్సహించారు. సినిమాల్లో ప్రయత్నించమని ప్రోత్సహించారు. డెంటల్ డాక్టర్ కావాల్సిన నేను నటిగా మారటానికి అమ్మ నాన్న నన్ను అర్థం చేసుకొని ప్రోత్సహించటం వల్ల అవకాశాల కోసం ఇండస్ట్రీలో అడుగు పెట్టాను అని వెల్లడించింది.