షూటింగ్ సమయంలో కృష్ణ అడిగిమరీ ఈ ఆహార పదార్థాలు తినేవారని తెలుసా?

సాధారణంగా హీరోలు మంచి బాడీ ఫిజిక్స్ మైంటైన్ చేయాలంటే ప్రస్తుతం హీరోలు డైట్ మెయింటెన్ చేయడమే కాకుండా పెద్ద ఎత్తున జిమ్ములో వర్కౌట్లు చేస్తూ తమ బాడీ ఫిజిక్స్ మైంటైన్ చేస్తూ ఉంటారు కానీ నిన్నటి తరం హీరోలు అలా కాదు సరైన ఆహారం తీసుకుంటేనే వారి ఆరోగ్యాన్ని కాపాడుకునేవారు. ఈ విధంగా అప్పటి హీరోలు ఎక్కడ వ్యాయామాలు చేయకుండా పౌష్టికాహారం తీసుకొని ఎంతో దృఢంగా ఉండేవారు. ఈ క్రమంలోని కృష్ణ గారు సైతం షూటింగ్ సమయంలో కోరి మరి తనకు ఇష్టమైన ఆహార పదార్థాలను తినేవారని రచయిత తోటపల్లి మధు..కృష్ణగారి ఫుడ్ హ్యాబెట్స్ విషయంలో ఇంట్రస్టింగ్ విషయాలు వెల్లడించారు.

ఈ సందర్భంగా తోటపల్లి మధు మాట్లాడుతూ కృష్ణ గారు ఉదయం ఇంటి దగ్గరే టిఫిన్ వంటి కార్యక్రమాలన్నింటిని పూర్తిచేసుకుని లొకేషన్లోకి అడుగు పెడతారు. ఈయన ఉదయం 11:30 ఆ సమయంలో పెరుగు ఆవడ తినేవారు. అప్పట్లో పెరుగు ఆవడ ఎంతో రుచికరంగా ఉండడంతో పెరుగు ఆవడ రాలేదా అంటూ కృష్ణ గారు అడిగిమరీ పెరుగు ఆవడ తెప్పించుకొని తినేవారు. ఇలా భోజనానికి టిఫిన్ కి మధ్యలో పెరుగు ఆవడ తప్పనిసరిగా ఉండాలి. ఇక మధ్యాహ్నం ఒంటిగంటకు తప్పనిసరిగా భోజనం చేసేవారు భోజనం సమయంలో ఇదే ఉండాలి అని నియమ నిబంధనలు ఏమీ లేవు.

ఇక మధ్యాహ్నం భోజనం పూర్తయిన తర్వాత మూడు గంటలకు తనకు తప్పనిసరిగా సున్నుండలు ఉండాల్సిందే. సున్నుండలవారు రాలేదా అంటూ తెప్పించుకొని మరి వాటిని తినేవారు. ఇక సాయంత్రం ఐదు గంటలకు కృష్ణ గారు ప్రతిరోజు వీట్ దోస తింటారు. మద్రాసులోఈ దోస ఎంతో ఫేమస్ ఇలా కృష్ణ గారి నిర్మాతలు ఆయన కోసం ఈ ఫుడ్ తప్పనిసరిగా తెప్పించే వారిని తోటపల్లి మధు కృష్ణ గారి ఫుడ్ హ్యాబిట్స్ గురించి తెలియజేశారు. ఇలా తనకు ఇష్టమైన ఆహార పదార్థాలను తిన్నప్పటికీ ఈయన మాత్రం ఎంతో ఫిట్నెస్ కలిగి ఉండేవారని తెలిపారు