చిరంజీవికే వార్నింగ్ ఇచ్చారా.?

పోసాని కృష్ణ మురళి ఎందుకు వచ్చాడబ్బా.? అశ్వనీదత్ రాజకీయ విమర్శలు పరోక్షంగానే అయినా ఎందుకు చేశాడబ్బా.? అసలంటూ రజనీకాంత్‌ని రాజకీయంగా వైసీపీ ఎందుకు టార్గెట్ చేసిందబ్బా.?

ఆరా తీస్తే, ఇదంతా చిరంజీవికి పరోక్షంగా ఇచ్చిన వార్నింగ్.. అని సినీ వర్గాల్లో గుసగుసలు వినిపిస్తున్నాయి. సినీ జనాలెవరైనా వైసీపీని విమర్శించాలనుకుంటే… వైసీపీని విమర్శించకపోయినా, టీడీపీని పొగిడారంటే.. ఇదిగో ఇలా వుంటుందంటూ రజనీకాంత్ మీద దాడి చేయడం ద్వారా సంకేతాలు పంపిందట వైసీపీ.

చిరంజీవి.. జనసేన అధినేత పవన్ కళ్యాణ్‌కి సోదరుడు. జనసేన తరఫున ఎన్నికల ప్రచారం చేయొచ్చన్న ప్రచారమూ జరుగుతోంది. ఈ నేపథ్యంలో ముందస్తుగా ఓ స్వీట్ వార్నింగ్ వైసీపీ ఇచ్చిందట.

సినిమాలు వేరు, రాజకీయాలు వేరని చెప్పిందెవరు.? సినిమాలు.. రాజకీయాలు కలగలిసే వున్నాయ్.!