సీనియర్ హీరోయిన్ రోజా గురించి ప్రత్యేకంగా పరిచయం చేయాల్సిన అవసరం లేదు. తెలుగు తమిళ్ మలయాళం భాషలలో స్టార్ హీరోల సరసన నటించి రోజా స్టార్ హీరోయిన్ గా గుర్తింపు పొందింది. రోజా హీరోయిన్ గా ఎన్నో సినిమాలలో నటించినప్పటికీ సెకండ్ ఇన్నింగ్స్ లో పవర్ ఫుల్ పాత్రలలో నటించింది. అంతే కాకుండా బుల్లితెర మీద ప్రసారమవుతున్న ఎన్నో టీవీ షోస్ లో జడ్జ్ గా వ్యవహరించి ప్రేక్షకులను కూడా బాగా ఆకట్టుకుంది. ఈటీవీలో ప్రసారమవుతున్న జబర్దస్త్ కామెడీ షోలో దాదాపు 8 ఏళ్లపాటు రోజా జడ్జి గా వ్యవహరించింది.
అంతే కాకుండా రోజా రాజకీయ నాయకురాలిగా మంచి గుర్తింపు పొందింది. ప్రస్తుతం మంత్రి పదవి దక్కటంతో రోజా సినిమా ఇండస్ట్రీకి దూరమైంది. వైసిపి పార్టీలో మొదట ఎమ్మెల్యేగా గెలుపొందిన రోజా అటు రాజకీయాలు ఇటు షూటింగ్ లను కూడా సమర్థవంతంగా నిర్వహించేది. అయితే ఇటీవల మంత్రి పదవి దక్కటంతో తన పూర్తి సమయం ప్రజలకు కేటాయించాలన్న ఉద్దేశంతో రోజా ఇండస్ట్రీకి దూరమైంది.ఇదిలా ఉండగా హీరోయిన్ గా గుర్తింపు రోజా దర్శకుడు సెల్వమణిని ప్రేమ వివాహం చేసుకుంది.
చెంబురతి సినిమా కోసం పనిచేస్తున్న సమయంలో రోజా కి సెల్వమణితో పరిచయం ఏర్పడి అది కాస్త ప్రేమగా మారింది. అయితే వీరిది అంత సులభంగా జరగలేదు. రోజా ని హీరోయిన్ గా చేయటానికి కసపడిన తన సోదరుల కోసం రోజా ఒక సినిమా తీసి వచ్చిన లాభాలను వారికి ఇచ్చిన తర్వత వివాహం చేసుకోవాలనుకుంది. ఈ క్రమంలో అప్పు చేసి మరీ సమరం అనే సినిమా తీశారు . ఈ సినిమా చాలా నష్టాలను తెచ్చిపెట్టింది . దీంతో తనని నమ్ముకున్న కుటుంబాన్ని కష్టాలనుండి బయట వేయటానికి రోజా ఎంతో కష్టపడి డబ్బులు సంపాదించింది అప్పులు మొత్తం తీర్చింది. ఈ క్రమంలో సెల్వమణి రోజా కోసం దాదాపు 11 సంవత్సరాల పాటు ఎదురు చూశాడు. ఇలా వీరు 11 సంవత్సరాల పాటు ప్రేమించుకొని ఆ తర్వాత పెద్దలు అంగీకారంతో వివాహం చేసుకున్నారు. వీరికి ఇద్దరు పిల్లలు.