ఆర్జీవీ ‘వ్యూహం’ బెడిసి కొట్టిందా.?

రామ్ గోపాల్ వర్మ ఇటీవల ‘వ్యూహం’ అనే టైటిల్‌తో సినిమా ప్రకటించి, తనదైన స్టైల్‌లో ఎప్పటిలాగే సంచలనమైన సంగతి తెలిసిందే. టైటిల్ ప్రకటించడంతో పాటూ, ఈ సినిమా నుంచి కొన్ని లుక్స్ కూడా రిలీజ్ చేసి సినిమాని ప్రమోట్ చేసుకున్నారు. ఆ పోస్టర్ లుక్స్‌తో మనోడు చేసిన హంగామా, హల్ చల్ అంతా ఇంతా కాదు మరి.

వైసీపీ సపోర్ట్‌తో ఈ సినిమా తెరకెక్కబోతోందన్న సంగతి తెలిసిందే. ఆ తరహాలోనే ఆర్జీవీ ప్రమోట్ చేసుకున్నాడు మరి. అంతా చేసినా ఈ సినిమాని ఆనుకున్నంత రీతిలో మైలేజ్ రాలేదే సరికదా.. ప్రమోషన్లలో భాగంగా రిలీజ్ చేసిన పోస్టర్లు వైసీపీకి ఇబ్బందికరంగా మారిపోయాయని గుసగుసలు వినిపిస్తున్నాయ్.

ఈ ఫోటోలు వైసీపీ మీద మీమ్స్ క్రియేట్ చేసుకోవడానికి కోరి ఆస్కారమిచ్చినట్లయ్యిందని అంటున్నారు. దాంతో, ఈ సినిమా తెరకెక్కించడం వల్ల తమకు ఒరిగేదేమీ వుండదని వైసీపీ శ్రేణులు భావిస్తున్నాయట.

దాంతో, ఈ సినిమాని లైట్ తీసుకుంటున్నారట. అయ్యో.! ఆర్జీవీ.! ఒకటనుకుంటే ఇంకోటి అయినట్లుంది. మరి, ఇకపై ఈ సినిమాపై ఇంకేమైనా మార్పులు చేర్పులు చేసిన వైసీపీ మెప్పు పొంది సినిమాని ముందుకు తీసుకెళతాడా.? లేదంటే, గతంలో ఆయన లిస్టులో వున్న చాలా వదిలేసిన సినిమాల మాదిరిగానే ‘వ్యూహం’ కూడా పక్కన పడేస్తాడా.? చూడాలి మరి.