అద్దె ఇంట్లో రాజమౌళి అండ్ టీమ్

లాస్ ఏంజిల్స్‌లో గత ఆదివారం రాత్రి ఆస్కార్ అవార్డును గెలుచుకున్న తర్వాత RRR టీమ్ ప్రత్యేకంగా పార్టీ చేసుకుంది. ఇక విశ్రాంతి తీసుకోవడానికి లాస్ ఏంజిల్స్ లోనే ఒక డూప్లెక్ హౌస్ కు వెళ్లారు. దర్శకుడు SS రాజమౌళి, స్వరకర్త కీరవాణి, గీత రచయిత చంద్రబోస్ నటులు Jr NTR రామ్ చరణ్‌లతో కూడిన బృందం వారి జీవిత భాగస్వాములతో లాస్ ఏంజిల్స్ లోని ఒక ఇంట్లో ఆనందిస్తున్నట్లు కనిపించారు.

ఆసక్తికరమైన విషయమేమిటంటే, దర్శకుడు గత ఆరు నెలలుగా తరచుగా USA కి ప్రయాణిస్తున్నట్లు తెలుస్తోంది. అక్కడ హోటల్స్ ఉండడం అనవసరపు ఖర్చు అని రాజమౌళి లాస్ ఏంజిల్స్ లోనే ఒక ఇంటిని అద్దెకు తీసుకున్నారట. అక్కడ బృందంతోనే ఉంటున్నారని సమాచారం.

అయితే రామ్ చరణ్ అతని భార్య ఉపాసన మాత్రం సమీపంలోని 7-స్టార్ హోటల్‌లో బస చేసినట్లు తెలుస్తోంది. అలాగే హాలీవుడ్ లో RRR కు సంబంధించిన హడావుడిలో మీడియా సహకారం కోసం వివిధ ఏజెంట్లు, నిర్మాతలను అలాగే ఇతర ప్రొడక్షన్ హౌస్‌లతో సమావేశాలు నిర్వహించడానికి దర్శకుడు ఆ ఇంటిని అద్దెకు తీసుకున్నారట.

అలాగే రాజమౌళి బృందం రాబోయే మహేష్ ప్రాజెక్ట్‌ కోసం కొన్ని VFX స్టూడియోలతో చర్చలు జరుపుతున్నట్లు కూడా తెలుస్తోంది. మొత్తానికి రాజమౌళి LAని తన రెండవ ఇల్లుగా చేసుకున్నాడని సమాచారం. ఇక మహేష్ ప్రాజెక్ట్ ను రాజమౌళి ఈ ఎడాది చివరలో స్టార్ట్ చేసే అవకాశం ఉంది. ఆ సినిమా యాక్షన్ అడ్వెంచర్ మూవీగా రాబోతోంది.