యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ ప్రస్తుతం రాధే శ్యామ్ సినిమాలో నటిస్తున్న సంగతి తెలిసిందే. ఈ సినిమా తర్వాత తన 21వ సినిమాని మహానటి ఫేం నాగ్ అశ్విన్ దర్శకత్వంలో చేయబోతున్నాడు. ప్రముఖ నిర్మాణ సంస్థ వైజయంతి మూవీస్ బ్యానర్ లో సి. అశ్వనిదత్ నిర్మిస్తుండగా బాలీవుడ్ స్టార్ హీరోయిన్ దీపికా పదుకొణె నటిస్తోంది. కాగా ఈ సినిమాని దాదాపు 400 కోట్ల భారీ బడ్జెట్ తో రూపొందించనున్నారు. అంతేకాదు దాదాపు అన్నీ ప్రధాన భాషల్లో రిలీజ్ చేయాలని మేకర్స్ ప్లాన్ చేస్తున్నారు.
ఇక ఈ సినిమాకి ప్రముఖ సీనియర్ దర్శకులు సింగీతం శ్రీనివాస్ రావు దర్శకత్వ పర్యవేక్షణ చేయనున్నారు. ఇటీవల ఈ విషయాన్ని నిర్మాణ సంస్థ అధికారకంగా ప్రకటించింది. వైజయంతి మూవీస్ కి 50 సినిమా కావడంతో మేకర్స్ ఎంతో ప్రతిష్టాత్మకంగా రూపొందించనున్నారు. అత్యంత హై టెక్నికల్ వ్యాల్యూస్ తో ప్రముఖ హాలీవుడ్ టెక్నీషియన్స్ ఈ ప్రాజెక్ట్ లో ఇన్వాల్వ్ చేస్తున్నాడు దర్శకుడు నాగ్ అశ్విన్.
అయితే ముఖ్యంగా తెలుగుతో పాటు బాలీవుడ్ లో ప్రభాస్ కి ఉన్న మార్కెట్ దృష్ఠ్యా దీపిక పదుకొణె ని హీరోయిన్ గా ఎంచుకోవడం పెద్ద హాట్ టాయిక్ అయితే అందుకు భారీగా రెమ్యూనరేషన్ ఆఫర్ చేయడం కూడా గత కొన్ని రోజులుగా అభిమానుల్లో, ఇండస్ట్రీ వర్గాలలో ఆసక్తికరమైన చర్చలకి తావిస్తోంది. ఇదిలా ఉంటే ఇప్పుడు ఈ సినిమాలో ప్రభాస్ దీపిక పదుకొణె ల పాత్రలకి సంబంధి కొత్త టాక్ మొదలై సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ప్రభాస్ తో పాటు దీపిక కి నేషనల్ వైడ్ క్రేజ్ ఉండటంతో సినిమాలో ప్రభాస్ కి ఉన్నంత ఇంపార్టెన్స్ దీపిక కి ఉండాలని ముందే మేకర్స్ కి చెప్పిందట.
ఇది ఇగో సమస్య అన్న టాక్ నడుస్తోంది. అయితే ప్రభాస్ కూడా దీపీక్ క్యారెక్టర్ తనతో సమానంగా ఉండేలా దర్శకుడికి సూచించినట్టు తెలుస్తుంది. నిజంగా ఇది ప్రభాస్ గొప్పతనం అని చెప్పాలి. అందుకు తగ్గట్టుగానే దర్శకుడు ప్రభాస్ కి సినిమాలో ఉన్నంత ఇంపార్టెన్స్ దీపిక క్యారెక్టర్ కి ఉండేలా స్క్రిప్ట్ సిద్దం చేస్తున్నట్టు చెప్పుకుంటున్నారు. నిజంగా ప్రభాస్ క్రేజ్ తో పోటీ పెట్టుకొని దీపిక ఇగో చూపిస్తే ఖచ్చితంగా ప్రభాస్ ఫ్యాన్స్ హర్ట్ అవడం ఖాయమని అంటున్నారు. ఏదేమైనా ప్రభాస్ – దీపిక కాంబినేషన్ అంటే మాత్రం ప్రాజెక్ట్ మీద ఊహించనంతగా అంచనాలు నెలకొన్నాయి.