ఎట్టకేలకు ‘ఆదిపురుష్’ రిలీజైంది. మొదట్నుంచీ నెగిటివిటీ వచ్చినట్లే.. సినిమా రిలీజ్ తర్వాత కూడా అదే నెగిటివిటీ ఈ సినిమా వెంటాడేసింది. హిందువుల ఇతిహాస గ్రంధమైన రామాయణాన్ని అడ్డదిడ్డంగా తెరకెక్కించి చూపించారంటూ, ముఖ్యంగా క్యారెక్టర్లను దారుణంగా వక్రీకరించారంటూ ఈ సినిమా తీసిన ఓం రౌత్‌ని తిట్టి పోస్తున్నారు.
ఇలాంటి సినిమాని ప్రబాస్ ఎందుకు ఒప్పుకున్నాడా.? అని ప్రబాస్‌నీ చెడుగుడు ఆడేసుకుంటున్నారు. ఈ సినిమా రిజల్ట్ ఇలాగే వుంటుందని ప్రబాస్‌కి ముందుగానే తెలిసిపోయిందా.? అంటే అవుననే అంటున్నారు. అందుకే ఈ సినిమాని ప్రమోట్ చేయడానికి పెద్దగా ఇంట్రెస్ట్ చూపించలేదు ప్రబాస్.
ఏ ఇంటర్వ్యూల్లోనూ పాల్గొనలేదు. కరెక్ట్‌గా రిలీజ్ టైమ్‌కి మీడియాకి అందుబాటులో లేకుండా పోయాడు. ముందుగా ఈ సినిమా ప్రమోషన్లని గ్రాండ్‌గా ప్లాన్ చేశారట. అయితే, లాస్ట్ మినిట్‌లో రిస్క్ అవసరమా.? అనుకున్నాడో ఏమో ప్రబాస్ సైడయిపోయాడు.
ఈ రోజుల్లో ఏ సినిమాకైనా రిజల్ట్‌తో సంబంధం లేకుండా రిలీజ్ తర్వాత సెలబ్రేషన్స్ చేసుకోవడం ట్రెండింగ్ అయిపోయింది. అయితే అది కూడా జరగలేదు ‘ఆది పురుష్’ విషయంలో. ఏదో తప్పక నిర్మాతలు మమ అనిపించేశారంతే. అయితే, 600 కోట్ల బడ్జెట్ సినిమాకి ఇలాగేనా చేసేది.? అని నిట్టూరుస్తున్నారు ఓ వర్గం. ఇక, డిస్ర్టిబ్యూటర్లు అయితే, ప్రబాస్ తీరు పట్ల అసహనం వ్యక్తం చేస్తున్నారు.