Junior NTR: రాజమౌళి దర్శకత్వం వహించినఆర్ఆర్ఆర్ సినిమా ఇటీవల విడుదలై బ్లాక్ బస్టర్ హిట్ గా నిలిచింది. ఈ సినిమాలో జూనియర్ ఎన్టీఆర్, రామ్ చరణ్ కలిసి నటించారు. ఎన్టీఆర్ కొమరం భీమ్ పాత్రలో నటించగా రామ్ చరణ్ అల్లూరి సీతారామరాజు పాత్రలో నటించి విమర్శకుల ప్రశంసలు కూడా అందుకున్నారు. ఈ సినిమా పాన్ ఇండియా లెవెల్ లో భారీ స్థాయిలో విడుదల అయ్యి ఎన్టీఆర్, రామ్ చరణ్ పాన్ ఇండియా స్టార్ లుగా గుర్తింపు పొందారు.ఈ సినిమా మంచి విజయం సాధించడంతో రామ్ చరణ్ తన ఇష్టదైవమైన అయ్యప్ప దీక్ష చేపట్టారు.
జూనియర్ ఎన్టీఆర్ కూడా అదే బాటలో ఇటీవల హనుమాన్ దీక్షలో కనిపించారు. అయితే సడన్ గా ఎన్టీఆర్ ఇలా హనుమాన్ దీక్ష తీసుకోవడానికి కారణం ఏంటని అభిమానులలో అనుమానాలు రేకెత్తాయి. అయితే దీనికి సమాధానంగా ఇండస్ట్రీలో పలు సమాధానాలు వినిపిస్తున్నాయి. ఎన్టీఆర్ జాతకం ప్రకారం ఎన్టీఆర్ హనుమాన్ దీక్ష తీసుకోవటం వల్ల తన జీవితంలో శుభ ఫలితాలు ఉన్నాయని, అందువల్ల పండితులు, తల్లి, భార్య సూచనల మేరకు జూనియర్ ఎన్టీఆర్ హనుమాన్ దీక్ష తీసుకున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి.
ఎన్టీఆర్ తన తర్వాత సినిమా “ఎన్టీఆర్ 30” వ సినిమాని కొరటాల శివ దర్శకత్వంలో చేయనున్నాడు. అయితే ఈ సినిమా షూటింగ్ మొదలు అవ్వటానికి ఇంకా ఆలస్యం అవటంతో ఎన్టీఆర్ హనుమాన్ దీక్ష తీసుకున్నట్లు సమాచారం. కొరటాల శివ దర్శకత్వంలో ఎన్టీఆర్ చేయబోయే సినిమా పాన్ ఇండియా లెవెల్ లో తెరకెక్కుతోంది. ఈ సినిమాలో ఎన్టీఆర్ మాస్ రోల్ లో ప్రేక్షకులను అలరించనున్నాడు. ఇదిలా ఉండగా అభిమానులు మాత్రం ఎన్టీఆర్ తన తర్వాత సినిమాని తొందరగా పూర్తి చేయాలని కోరుకుంటున్నారు. ఎన్టీఆర్ పాన్ ఇండియన్ హీరోగా మరెన్నో విజయాలు అందుకోవాలని అభిమానులు ఆశిస్తున్నారు.