Naga Babu: కొందరు హీరోలు తల్లిదండ్రుల పేరు, ప్రఖ్యాతలతో పైకి వస్తారు. మరి కొందరు తమ స్వాశక్తితో కెరీర్లో దూసుకు పోతారు. అలాంటి విషయానికొస్తే మెగా ఫ్యామిలీ గురించి ప్రస్తుతం టాక్ వినిపిస్తోంది. అందులో ముఖ్యంగా మెగా బ్రదర్ నాగబాబు, ఆయన తనయుడు వరుణ్ తేజ్ గురించి ఇప్పుడు కొన్ని విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. చాలా మంది హీరోలు రాజకీయాలకు దూరంగా ఉంటారు. కారణం దాని వల్ల వారి కెరీర్ కి అడ్డంకి వస్తుందని. సినిమాల కంటే రాజకీయాల ప్రభావం ప్రజల్లో చాలా ఉంటుంది. ఇప్పటి వరకు ఎంతో మంది సినీ తారలు రాజకీయాల్లోకి వచ్చి, అవి వర్కవుట్ కాక మళ్ళీ సినిమాలు చేస్తున్న వారూ లేకపోలేదు. ఎందుకంటే మూవీస్ ఉన్న హీరో క్యారెక్టర్ కి, బయట బిహేవియర్ కి చాలా తేడా ఉంటుంది. అది సక్సెస్ కానపుడు ఫెయిల్ అవ్వడం ఖాయం. అందుకే చాలా మంది సెలబ్రిటీలు రాజకీయాలు అంటే కాస్త ఎడం పాటిస్తూ ఉంటారు.
అయితే నాగబాబు ముందు నుంచే పవన్ కళ్యాణ్ పెట్టిన జనసేన పార్టీకి మద్దతుగా నిలుస్తున్న విషయం తెలిసిందే. అందులో భాగంగా వైసీపీ పై తీవ్ర స్థాయిలో వ్యాఖ్యలు చేసి వార్తల్లో నిలిచారు. ఆ ప్రభావం అప్పట్లో సాయి ధరమ్ తేజ్ హీరోగా చేసిన రిపబ్లిక్ సినిమా విషయంలో ఇది ప్రస్ఫుటంగా వ్యక్తం అయింది. కంటెంట్ ఎంత బాగున్నా అప్పట్లో పవన్ కళ్యాణ్, నాగ బాబు చేసిన వ్యాఖ్యల వల్ల ఆ సినిమా ప్లాప్ అయింది.
ఇక తాజాగా ఆ తరహాలోనే వరుణ్ తేజ్ హీరోగా నటించి ఇటీవలే విడుదల అయిన గని సినిమా విషయంలోనూ మళ్ళీ రిపీట్ అయింది. మొదటి రోజు నుంచే నెగటివ్ టాక్ ను సొంతం చేసుకున్న ఈ మూవీ, నాగబాబు తీరుతో భారీ నష్టాలను చూడాల్సి వచ్చిందని పలువురు భావిస్తున్నారు. దీనిపై ఇప్పటికే సోషల్ మీడియాలో రచ్చ సాగుతోంది. మరి పవన్ కల్యాణ్ తీసే సినిమాలపై ఎందుకు ఆ ప్రభావం ఎందుకు ఉండట్లేదు అంటే అతనికి ఉన్న ఫ్యాన్స్ బేస్ వేరు, రాజకీయాలకు అతీతంగా సినిమాలు తీయడమేనని సినీ వర్గాల సమాచారం. ఆ విషయానికొస్తే వకీల్ సాబ్, భీమ్లా సినిమాలు కూడా ఏపీలో నష్టాలను ఎదుర్కోలేక తప్పలేదు.
ఇప్పుడు వరుణ్ తేజ్ విషయంలోనూ అదే జరుగుతుండడంతో ఆయన అభిమానులు తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. నాగబాబు చేసే పలు కామెంట్స్ వల్ల వరుణ్ కెరీర్ కి ఇబ్బందులు వస్తాయని వారు అభిప్రాయ పడుతున్నారు. ఒకప్పుడు ఫిదా, ఎఫ్ 2, గద్దలకొండ సినిమాలతో హిట్ ట్రాక్ లో ఉన్న వరుణ్, ఇప్పుడు సడెన్ గా ప్లాప్ బాటలో పడతాడేమోనని ఆయన ఫ్యాన్స్ ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.0