Adhire Abhi: మల్లెమాల వారు అభిని జబర్దస్త్ నుంచి పొమ్మనలేక పొగ పెట్టారా..?

Adire Abhi: ఈటీవీలో ప్రసారమవుతున్న జబర్దస్త్ కామెడీ షో ద్వారా ఎంతో మంది కమెడియన్లుగా పరిచయం అయ్యారు. జబర్దస్త్ కామెడీ షో ద్వారా అదిరే అభి మంచి గుర్తింపు తెచ్చుకున్నాడు. ఈయన ఎంతోమంది ఆర్టిస్టులను ఈ షో ద్వారా ఇండస్ట్రీకి పరిచయం చేశాడు. ప్రస్తుతం జబర్దస్త్ లో టాప్ కమెడియన్ గా కొనసాగుతున్న ఆది కూడా అదిరే అభి టీమ్ నుండి వచ్చిన వాడే . ఇలా ఎంతో మంది కమెడియన్లు కు అభి లైఫ్ ఇచ్చాడు.

జబర్దస్త్ కామెడీ షో లో అభి చేసే కామెడీ పంచ్ డైలాగులతో మంచి గుర్తింపు తెచ్చుకున్నాడు. అలాంటి అవి గత కొన్ని రోజులుగా జబర్దస్త్ లో కనిపించలేదు. దీంతో ప్రేక్షకుల్లో పలు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ప్రస్తుతం అది మా టీవీలో ప్రసారం అవుతున్న కామెడీ స్టార్స్ ప్రోగ్రామ్ లో సందడి చేస్తున్నారు. అక్కడ కూడా తన కామెడీతో ప్రేక్షకుల అభిమానాన్ని సొంతం చేసుకున్నాడు. అయితే ఇంత కాలం జబర్దస్త్ లో కొనసాగిన అదిరే అభి ఇప్పుడు మాటీవీలో కనిపించడానికి గల కారణం ఏంటని ప్రేక్షకుల్లో అనుమానాలు మొదలయ్యాయి.

అదిరే అభి మల్లెమాల వారు ఇచ్చే పారితోషికం విషయంలో అసంతృప్తిగా ఉన్నాడని సమాచారం. సుడిగాలి సుధీర్, హైపర్ ఆదితో సమానంగా తన రెమ్యూనరేషన్ ఇవ్వాలంటూ అవి మల్లెమాల వారిని డిమాండ్ చేశాడని, అందువల్ల మల్లెమాల వారు అంత పారితోషికం ఇవ్వకపోవడం వల్లే అభి జబర్దస్త్ కి స్వస్తి చెప్పి మాటీవీలో ప్రసారం అవుతున్న కామెడీ స్టార్ లో చేస్తున్నాడని సమాచారం. పారితోషికం విషయంలో మల్లెమాల వారు స్ట్రిక్ట్ గా ఉండి కంటెంట్ కి తగ్గట్టే పారితోషికం ఇస్తారు. ప్రస్తుతం స్టార్ మాలో చేస్తున్నందుకు అభికి మంచి పారితోషికం అందుతున్నట్లు ఆయన సన్నిహితుల నుండి సమాచారం.