రౌడీ ఇన్స్పెక్టర్ సినిమా సమయంలో బాలకృష్ణ ఏకంగా అలాంటి కండిషన్ పెట్టారా?

నందమూరి బాలకృష్ణ సినిమా అంటే ప్రేక్షకులకు భారీ అంచనాలుంటాయి. ఈయన ఇండస్ట్రీలో హీరోగా ఎంట్రీ ఇచ్చినప్పటి నుంచీ ఎన్నో అద్భుతమైన సినిమాలలో నటించి తన సత్తా ఏంటో చూపించారు. ఈ క్రమంలోనే బి. గోపాల్ బాలకృష్ణ కాంబినేషన్లో సినిమా అంటే సూపర్ హిట్ అవ్వడం ఖాయం. ఈ క్రమంలోనే వీరిద్దరి కాంబినేషన్లో 1992 మే 7వ తేదీ వచ్చిన రౌడీ ఇన్స్పెక్టర్ సినిమా బాక్సాఫీస్ వద్ద అద్భుతమైన విజయాన్ని అందుకుని సరికొత్త రికార్డును సృష్టించింది. అయితే ఈ సినిమా కోసం బాలకృష్ణ ఎంతో కష్ట పడినట్లు బి.గోపాల్ వెల్లడించారు.

రౌడీ ఇన్స్పెక్టర్ సినిమా సమయంలో బాలకృష్ణ ఒక పోలీస్ ఆఫీసర్ ఎలా వ్యవహరిస్తారు. ఆయన ఏ విధంగా లాఠీ పట్టుకుంటారు.అతడి నడవడిక ఎలా ఉంటుంది అనే విషయాల గురించి బాలకృష్ణ ఎంతో కష్టపడి నేర్చుకున్నారని వెల్లడించారు.ఇక ఈ సినిమా షూటింగ్ చేస్తున్నంతసేపు ఆయన ఒక నిజమైన పోలీస్ ఆఫీసర్ గా లీనమై నటించారని అందుకే ఈ సినిమా ప్రతి ఒక్క ప్రేక్షకుడిని ఆకట్టుకుందని బి గోపాల్ వెల్లడించారు.

ఇక ఈ సినిమా షూటింగ్ కి రావడానికి బాలకృష్ణ కోసం కారు పంపిస్తే ఆయన ఫోన్ చేసి ఇవాళ నేను షూటింగ్ కి రావడం లేదు. నేను షూటింగ్ కు రావాలంటే తప్పనిసరిగా నాకు పోలీస్ జీప్ పంపించాలని ఆయన కండిషన్ పెట్టారు. బాలకృష్ణ ఇలాంటి కండిషన్ పెట్టడం తో తప్పనిసరి పరిస్థితులలో ఆయన కోసం పోలీస్ జీప్ పంపించాము. ఇలా బాలకృష్ణ ఇంటి నుంచి షూటింగ్ కోసం నిజమైన పోలీస్ ఆఫీసర్ మాదిరిగా కాలు బయట పెట్టుకొని చేతితో లాఠీ తిప్పుతూ వచ్చారు. ఇలా బాలకృష్ణ సినిమాలో నటిస్తే ఒక పాత్రలో లీనమై చేస్తారని రౌడీ ఇన్స్పెక్టర్ 30 సంవత్సరాలను పూర్తి చేసుకున్న సందర్భంగా ఈ సినిమా గురించి ఆసక్తికరమైన విషయాలను వెల్లడించారు.