‘ధూంధాం’ ఫస్ట్‌ లుక్‌ పోస్టర్‌ విడుదల

చేతన్‌ కృష్ణ, హెబ్బా పటేల్‌ హీరోహీరోయిన్లుగా నటిస్తున్న సినిమా ‘ధూం ధాం’. సాయికుమార్‌, వెన్నెల కిషోర్‌, పృథ్వీరాజ్‌, గోపరాజు రమణ ఇతర కీలక పాత్రలలో నటిస్తోన్న ఈ చిత్రాన్ని ఫైడ్రే ఫ్రేమ్‌ వర్క్స్‌ బ్యానర్‌ పై ఎంఎస్‌ రామ్‌ కుమార్‌ నిర్మిస్తున్నారు.

లవ్‌, ఫ్యామిలీ ఎంటర్‌టైనర్‌గా రూపుదిద్దుకుంటోన్న ఈ చిత్రానికి దర్శకుడు సాయి కిశోర్‌ మచ్చ. గోపీ మోహన్‌ స్టోరీ, స్క్రీన్‌ప్లే అందిస్తున్నారు. ప్రస్తుతం చిత్రీకరణ తుది దశలో ఉన్న ఈ సినిమాను.. ఈ సమ్మర్‌కు రిలీజ్‌ చేసేందుకు మేకర్స్‌ సన్నాహాలు చేస్తున్నారు. తాజాగా ఈ చిత్ర ఫస్ట్‌ లుక్‌ పోస్టర్‌ను మూవీ టీమ్‌ చిత్ర ఆన్‌ లొకేషన్‌లో రిలీజ్‌ చేశారు.

ఈ ‘ధూం ధాం’ ఫస్ట్‌ లుక్‌ పోస్టర్‌ను గమనిస్తే.. పెళ్లి బారాత్‌లో హీరోహీరోయిన్లు హ్యాపీగా డ్యాన్స్‌ చేస్తున్న స్టిల్‌ను ఫస్ట్‌ లుక్‌ పోస్టర్‌గా మేకర్స్‌ విడుదల చేశారు. కలర్‌ ఫుల్‌గా ఉన్న ఈ ఫస్ట్‌ లుక్‌ పోస్టర్‌ ఆకట్టుకుంటోంది. ఓ మంచి లవ్‌ అండ్‌ ఫ్యామిలీ ఎంటర్‌టైనర్‌గా.. అన్ని వర్గాల ప్రేక్షకులను ఆకట్టుకునేలా ఈ సినిమాను రూపొందిస్తున్నట్లు గా మేకర్స్‌ తెలిపారు. త్వరలోనే ఈ సినిమాకు సంబంధించిన మరిన్ని వివరాలను తెలియజేస్తామని ఈ సందర్భంగా మేకర్స్‌ తెలియజేశారు.