పూజా కార్యక్రమాలను పూర్తి చేసుకున్న ధనుష్ కొత్త సినిమా.. ఫోటోలు వైరల్!

ఈ మధ్యకాలంలో పరభాష హీరోలందరూ కూడా తెలుగు సినిమాలపై ఆసక్తి చూపిస్తున్నారు. ఇప్పటికే పలువురు కోలీవుడ్, బాలీవుడ్ హీరోలు అందరూ నేరుగా తెలుగు సినిమాలలో నటిస్తూ ఎంతో మంచి గుర్తింపు పొందారు. ఇక కోలీవుడ్ ఇండస్ట్రీలో అగ్ర హీరోగా ఎంత పేరు ప్రఖ్యాతలు సంపాదించుకున్న నటుడు ధనుష్ టాలీవుడ్ డైరెక్టర్ శేఖర్ కమ్ముల దర్శకత్వంలో ఓ సినిమా చేయబోతున్నట్లు ప్రకటించారు. అయితే శేఖర్ కమ్ముల సినిమా కన్నా ముందుగా ధనుష్ వెంకీ అట్లూరి దర్శకత్వంలో సార్ అనే సినిమాకు కమిట్ అయిన విషయం తెలిసిందే.

ప్రస్తుతం సార్ సినిమా శరగంగా షూటింగ్ పనులను జరుపుకుంటుంది. ఈ సినిమా వచ్చే ఏడాది ఫిబ్రవరి నెలలో విడుదలకు సిద్ధమైంది.ఇకపోతే ఈ చిత్రాన్ని కూడా పాన్ ఇండియా స్థాయిలో విడుదల చేయనున్నట్టు సమాచారం ఇదిలా ఉండగా తాజాగా శేఖర్ కమ్ముల దర్శకత్వంలో ధనుష్ చేయబోయే సినిమా పూజా కార్యక్రమాలను పూర్తి చేసుకున్నారు. ఈ క్రమంలోనే ఈ సినిమా పూజ కార్యక్రమాలకు సంబంధించిన ఫోటోలు ప్రస్తుతం వైరల్ అవుతున్నాయి. త్వరలోనే ఈ సినిమా రెగ్యులర్ షూటింగ్ పనులను ప్రారంభం జరుపుకోనుంది.

ఇకపోతే ఈ సినిమాని శ్రీ వెంకటేశ్వర సినిమాస్ బ్యానర్‌పై నారాయణ దాస్ నారంగ్, పుష్కర్ రామ్ మోహన్ రావు నిర్మిస్తున్నారు. ఈ సినిమాని కూడా పాన్ ఇండియా స్థాయిలో ప్రేక్షకుల ముందుకు తీసుకురావడానికి సిద్ధమయ్యారు.ఇక ఈ సినిమాలో మరోసారి సాయి పల్లవి నటించబోతుందని వార్తలు వచ్చినప్పటికీ ఈ విషయం గురించి ఏ విధమైనటువంటి ప్రకటన వెలబడలేదు అయితే సాయి పల్లవి ఇదివరకే శేఖర్ కమ్ముల దర్శకత్వంలో ఫిదా,లవ్ స్టోరీ వంటి సినిమాలలో నటించి అద్భుతమైన విజయాన్ని అందుకోవడంతో ధనుష్ సినిమాలో కూడా ఈమె హీరోయిన్ గా నటించబోతుందని వార్తలు వస్తున్నాయి. మరి ఈ వార్తలలో ఎంతవరకు నిజం ఉందో తెలియాల్సి ఉంది.